ప్రజల ఆశాజ్యోతి వైయస్‌ జగన్‌..

శ్రీకాకుళంఃమూడు పంటలు పండించుకునే రైతులు ఒక పంట మాత్రమే పండించుకునే దుస్థితికి టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికి కూడా చంద్రబాబు నాయుడు రైతులను మోసగించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడని విమర్శించారు.తిత్లీ తుపాన్‌ నష్టపరిహారం కూడా రైతులకు పూర్తిగా అందలేదని, పచ్చచొక్కాల జేబుల్లోకి వెళ్ళాయని మండిపడ్డారు. డ్వాక్రా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారన్నారు.కేంద్రపథకాలను కూడా టీడీపీ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు.  రైతులు చంద్రబాబును నమ్మే పరిస్థితులు లేవన్నారు.వైయస్‌ఆర్‌ బతికుంటే మాకు ఈ దుస్థితి ఉండేందికాదని ప్రజలు అంటున్నారన్నారు. దివంగత నేత వైయస్‌ఆర్‌ ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే మేలు చేస్తారని పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారన్నారు.ప్రజలందరూ పాదయాత్రకు తరలివస్తున్నారన్నారు.
 

Back to Top