చంద్రబాబు అసహనం..ఎమ్మెల్యే మైక్ కట్

కర్నూలుః  ప్రభుత్వం అడుగడుగునా ప్రతిపక్షం గొంతు నొక్కుతోంది.  మరోసారి చంద్రబాబు తన కుట్రలకు పదునుపెట్టాడు. కర్నూలు జిల్లా తంగెడంచ వద్ద ఏర్పాటు చేసిన మీటింగ్ లో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారు. ప్రజల గొంతు వినిపించకుండా కుట్రపన్నారు. జైన్ ఇరిగేషన్ సంస్థకు ఎంత భూమి కేటాయించారో ఎవరికి తెలియదని, మీ ఇష్టానుసారంగా పనిచేసుకుంటే ప్రజలకు ఏలా మేలు జరుగుతుందని ఐజయ్య చంద్రబాబును నిలదీశారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐజయ్య మాట్లాడుతుండగా ప్రజలు ఉత్సాహంగా విజిల్స్ వేయడంతో చంద్రబాబు అసహనం ప్రదర్శించారు. మైక్ అందుకొని ఇది అసెంబ్లీ కాదంటూ చిర్రుబుర్రులాడారు. గతంలో కూడ ఐజయ్య మాట్లాడుతుండగా చంద్రబాబు మైక్ కట్ చేసి ఇలాగే అసహనం ప్రదర్శించారు.

Back to Top