ప్రజల్లో టీడీపీ విశ్వాసం కోల్పోయింది...

జగన్‌పై హత్యాయత్నంలో టీడీపీ చవకబారు వ్యాఖ్యలు తగదు
వైయస్‌ఆర్‌సీపీ నేత గండికోట శ్రీకాంత్‌ రెడ్డి
హైదరాబాద్ః గుమ్మడికాయ దొంగలు ఎవరంటే టీడీపీ భుజాలు తడుముకుంటుందని వైయస్‌ఆర్‌సీపీ నేత గండికోట శ్రీకాంత్‌ విమర్శించారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించడంలేదని మండిపడ్డారు.  ఇంటిలిజెన్స్,భద్రత వైఫల్యం చెంది తప్పును కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ నేతలు  చవకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైయస్‌ జగన్‌కు డ్రామా లాడటం రాదని, ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం జరిగిన వెంటనే జగన్‌ చొక్కా రక్తంతో తడిసి ముద్దయిపోయిందని, కాని వైయస్‌ జగన్‌ వేరొక చొక్కా వేసుకుని ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెళ్ళారని తెలిపారు.  చంద్రబాబు నాయుడులాగా ఒక్క చేతికి గాయమయితే మరో చేతికి కట్టుకుని  డ్రామాలాడే వ్యక్తి  కాదన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ సంఘటనను రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. గుమ్మడి దొంగలంటే భుజాలు తడుముకున్నట్లు టీడీపీ వ్యవహరిస్తుందన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో క్యాంటిన్‌ టీడీపీకి చెందిన వ్యక్తిదని, అందులో పనిచేస్తున్న వెయిటర్‌ వైయస్‌ఆర్‌సీపీ అభిమాని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు  ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీ ప్రభుత్వం చవకబారు వ్యాఖ్యలను ఖండించారు.

తాజా వీడియోలు

Back to Top