బాబు దోపిడీపై పోరాడుతూనే ఉంటాం
– చంద్రబాబు, లోకేష్‌ అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తే నాపై కక్ష
– ఎలాంటి తప్పు చేయలేదు
– దుర్గా ప్రసాద్‌ నుంచి భూములు కొన్నది వాస్తవమే
– చంద్రబాబు చేసే ప్రతి దోపిడీని మేం నిరోధించగలిగాం
విజయవాడ: చంద్రబాబు దోపిడీపై న్యాయ పోరాటం కొనసాగిస్తానని, ఆయన బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు, ఆయన కుమారుడి అవినీతిని బయటపెట్టినందుకే తనపై కక్షగట్టారని ఆర్కే విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటు మీడియాలోనూ, సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాన్ని ఖండించారు. అసలు ఏం జరిగిందని, ఏం జరుగుతుందని ఆయన వివరించారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ ప్రభుత్వం ఎందుకిలా చేస్తుందని తెలిపారు. టీడీపీ తనను ఎందుకు టార్గెట్‌ చేశారో వివరించారు. దుర్గా ప్రసాద్‌ అనే డీఎస్పీ తనకు స్నేహితుడని, 2006లో ఆయన ఆయన పొలం కొనుగోలు చేశానని, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేయించారన్నారు. ఏడాది క్రితం దుర్గాప్రసాద్‌ ఆస్తులపై ఏసీబీ దాడులు చేశారని, నా ఆస్తులు దుర్గా ప్రసాద్‌ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేశానని, ఆయన బినామీ అంటూ దుష్ప్రచారం చేశారన్నారు. ఆయన అమ్మారు..నేను కొన్నానని వివరించారు. ఏ ఒక్క పేపరైనా నా ఆస్తులకు సంబంధించి దుర్గా ప్రసాద్‌ ఇంట్లో దొరికిందని నిరూపణ చేస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా పక్కకు వెళ్తానని సవాల్‌ విసిరారు. దుర్గా ప్రసాద్‌ ఇంట్లో దాడులు చేసినప్పుడు అతనితో సంతకాలు చేయించుకున్నారని, ఆ సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఆస్తులు ఎక్కడ లేవన్నారు. నా భార్య పేరు మీద ఆస్తులు కొనలేదని, కాపు సోదరుడి వద్ద, డీఎస్సీ వద్ద ఆస్తులు కొనుగోలు చేయవద్దా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసే అవినీతి, అక్రమాలను సాక్ష్యాధారలతో సహా బయటపెట్టడంతో నాపై కక్ష గట్టారని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు నుంచి నోటీసులు ఇప్పించినందుకే తనను వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఏడాది క్రితం దుర్గా ప్రసాద్‌ ఇంట్లో దాడులు జరిగితే ఇన్నాళ్లు మౌనంగా ఉండి..ఈ రోజు నాపై ఏసీబీ అధికారులు విచారణకు పిలిచారని, కేవలం సాక్షిగా నన్ను విచారణకు పిలిచారన్నారు. నా కంటికి గ్లోకోమా సర్జరీ జరిగిందని, 15 రోజుల గడువు కోరానని చెప్పారు. ఆ తరువాత అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. నేను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. రైతుల పొట్ట కొట్టి వేలాది ఎకరాలు లాక్కుంటున్నారని న్యాయస్థానంలో పోరాటం చేస్తుంటే చంద్రబాబుకు నచ్చలేదని, అందుకే నాపై కక్షగట్టారన్నారు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడు, ఆయన కొడుకు లాంటి దద్దమ్మ లాంటి వ్యక్తులు ఏ రోజునైనా గుడికి వెళ్తే..వారికోసం పూజలు చేసే బ్రహ్మణుల భూములను కూడా లాక్కున్నారని చెప్పారు. మై క్యాపిటల్, మై అమరావతికి వెళ్లే విద్యార్థులు రూ.10 కట్టాలని ప్రభుత్వం జీవో ఇస్తే మేం న్యాయ స్థానం ద్వారా నిరోధించామన్నారు. ప్రజాస్వామ్యం తలదించుకునే విధంగా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన చంద్రబాబు ఇప్పటికీ ఆ వాయిస్‌ తనది కాదని, అవునని చెప్పలేని వ్యక్తి అన్నారు. ఈ రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నారన్నారు. మహానాడు పేరుతో దగా నాడులో లోకేష్‌ ఏవిధమైన పరిజ్ఞానంతో మాట్లాడారో చూశామన్నారు. గత డిసెంబర్‌ నుంచి చంద్రబాబు నాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని వివరించారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన న్యాయస్థానం విచారణకు ముందుకు రావడంతో చంద్రబాబు ఒత్తిళ్లకు లొంగలేదని తనపై వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. 15.12.2017, 5.02.2018, 22.02.2018, 27.04.2018 ఐదు సార్లు సుప్రీం కోర్టులో ఓటుకు కోట్లు కేసుపై నోటీసులు ఇచ్చానని, ఇంతవరకు విచారణకు పిలువలేదని చెప్పారు. బీసీలను న్యాయమూర్తులుగా నియమించడానికి వీలు లేదని చంద్రబాబు ప్రయత్నించారని, అతిత్వరలోనే రిటైర్డు కాబోతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా చంద్రబాబు చేస్తున్న పనులను తప్పుపట్టారన్నారు. రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు అక్రమ సంపాదనను ఫిబ్రవరి 28, 2018న లేఖ అందించానన్నారు. చంద్రబాబు ప్రజాధనాన్ని ఏవిధంగా కాజేస్తున్నాడని ప్రధానికి లేఖల ద్వారా వివరించానని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గాన్ని బయటపెట్టే వరకు పోరాటం కొనసాగిస్తానని ఆయన హెచ్చరించారు. నా ఫోన్లు ట్యాపంరింగ్‌కు పాల్పడుతున్నారని, అలాంటి నీచమైన బుద్ధిగల వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
 
Back to Top