జగనన్న చెప్పాడంటే...అమలు చేస్తాడంతే

వైయ‌స్ జగనన్నను సీఎం చేసుకుంటే మరింత సంక్షేమం
 
టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు గల్లంతు

బ్ర‌హ్మ‌స‌ముద్రంలో ఎమ్మెల్యే అభ్య‌ర్థి త‌లారి రంగ‌య్య ఎన్నిక‌ల ప్ర‌చారం

కళ్యాణదుర్గం : ముఖ్యమంత్రి వై.య‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పాడంటే తప్పని సరిగా అమలు చేస్తాడని ఎంపీ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ తలారి రంగయ్య  అన్నారు. బ్రహ్మసముద్రం మండల పరిధిలోని ముప్పులకుంట , పిల్లలపల్లి , గొంచిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో రంగ‌య్య‌ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వ‌హించారు. ఆయా గ్రామాల్లో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జగనన్న పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.  చంద్రబాబు గతంలో 600 హామీలు  ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఈ విషయం ప్రజలు ఎప్పటికీ మరువరన్నారు.ఇప్పుడు 6 హామీలతో ప్రజల్లోకి వస్తున్న చంద్రబాబుకు 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని చెప్పారు.

ప్రజలకు ఏం చేయలేని టిడిపి ఓట్ల కోసం నానా తంటాలుపడుతూ అబద్ధపు హామీలతో ప్రజల్లోకి వస్తుంటే ప్రజలు నిలదీస్తున్నారన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్ధి శంకర్ నారాయణను, ఎమ్మెల్యే అభ్యర్ధి అయిన తన‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని త‌లారి రంగ‌య్య‌ ప్రజలను కోరారు. 

Back to Top