వంచనపై గర్జన ఏర్పాట్లును పరిశీలించిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

కాకినాడః ఏపీకి ప్రత్యేకహోదా దక్కకుండా ప్రజలను నిలువునా దగా చేసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసగాన రేపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్‌లో వంచనపై వైయస్‌ఆర్‌సీపీ గర్జన దీక్ష ఏర్పాట్లను  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బోత తదితర నేతలు పరిశీలించారు.పహోదా,విభజన చట్టంలో హామీలను కేంద్రం అమలు చేయించడంలో చంద్రబాబు విఫలమయ్యారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అన్నారు. .ప్రజలు ఏవిధంగా మోసం చేస్తున్నారో అందరూ గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలకునే అన్ని సంఘాలు,విద్యార్థులు. యువత సహా అందరూ దీక్షలో పాల్గొనాలని వైయస్‌ఆర్‌సీపీ ఉభయగోదావరి జిల్లాల అదనపు ప్రాంతీయ పరిశీలకులు  వైవీ సుబ్బారెడ్డి అన్నారు.ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైయస్‌ఆర్‌సీపీ నాలుగేళ్లుగా ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసిందని ఈ సందర్భంగా వివరించారు.
Back to Top