పార్లమెంట్‌ ఆవరణలో వైయస్‌ఆర్‌సీపీ నేతల నిరసన


న్యూఢిల్లీ: ఏపీ పునర్వీభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురువారం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. బీజేపీ, టీడీపీలు పార్లమెంట్‌ వేదికగా లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని వారు మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు హెచ్చరించారు.
 
Back to Top