ఏలూరులో వైయస్‌ఆర్‌సీపీ నాయకుల సంఘీభావ పాదయాత్ర


పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా  ఏలూరులో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ముందుగా భారీ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాదయాత్రలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు కోఠారు అబ్బాయి చౌదరి, కోటగిరి శ్రీధర్, కోఠారు రామచంద్రరావు, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. వైయస్‌ జగన్‌ అడుగుజాడల్లో నడుస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. 2014 లో పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాల్లో గెలుచుకున్న చంద్రబాబు ఈ జిల్లాకు చేసింది ఏమీ లేదన్నారు. చంద్రబాబు ప్రజలను పట్టించుకోవడం మానేశారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు జిల్లాలో విశేష స్పందన వచ్చిందన్నారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆతృతగా ఎదురుచూస్తున్నారన్నారు. 
 
Back to Top