ఉత్సాహంగా తరలివెళ్లిన వైయస్సార్‌సీపీ శ్రేణులు

కారంపూడి :మాచర్లలో జరిగిన వైయస్సార్‌సీపీ ప్లీనరీకి మండలం నుంచి నాయకులు కార్యకర్తలు శనివారం బైక్‌లపై ఉత్సాహంగా పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. సుమారు 500 మంది యువకులు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. జై జగన్, పీఆర్కే జిందాబా«ద్‌ నినాదాలతో హోరెత్తించారు. వైయస్సార్‌ విగ్రహం నుంచి మాచర్లకు తరలి వెళ్లారు. మండలం నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా నాయకులు కార్యకర్తలు ప్లీనరీకి వెళ్లారు. మండల పార్టీ అధ్యక్షుడు పంగులూరి రామకృష్ణయ్య వివిధ విభాగాల నాయకులు, మాజీ ఎంపీపీలు పంగులూరి చినవెంకటనర్సయ్య, జక్కా సాంబయ్య, మాజీ వైస్‌ఎంపీపీ షేక్‌ అక్బర్, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు కార్యక్రమానికి తరలి వెళ్లారు. కారంపూడి, గాదెవారిపల్లె, చినగార్లపాడు, చినకొదమగుండ్ల, కాచవరం, ఇనుపరాజుపల్లె, బట్టువారిపల్లె, ఒప్పిచర్ల, చింతపల్లి, నరమాలపాడు, పేటసన్నెగండ్ల, లక్ష్మీపురం, మిరియాల గ్రామాల నుంచి మరికొందరు తరలివెళ్లారు.

తాజా వీడియోలు

Back to Top