చ‌లో ఢిల్లీ
నిన్న రాత్రి విజ‌య‌వాడ నుంచి ఢిల్లీకి ప్ర‌త్యేక రైలు  
- అనంత‌పురం నుంచి ప్ర‌త్యేక బ‌స్సు
-  ఇవాళ ప్ర‌కాశం జిల్లా నుంచి ప్ర‌త్యేక వాహ‌నాలు
- రైల్వే స్టేష‌న్ల‌లో మారుమ్రోగుతున్న హోదా డిమాండు
అమరావతి: ప్రత్యేక హోదా సాధన కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. ఈ మేర‌కు నిన్న మ‌ధ్యాహ్నం అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నుంచి ప్ర‌త్యేక బ‌స్సు బ‌య‌లుదేరింది. ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనే నాయకులు, కార్యకర్తల కోసం విజయవాడ నుండి ఢిల్లీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి విజ‌య‌వాడ నుంచి ఆ రైలు బ‌య‌లుదేరింది. వీరు రైలు ఆగిన ప్ర‌తి చోట ప్ర‌త్యేక హోదా నినాదాల‌తో హోరెత్తిస్తున్నారు. అలాగే ఇవాళ ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ప్ర‌తినిధుల బృందం ఢిల్లీకి బ‌య‌లుదేరింది. ఈ యాత్ర‌ను పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్ర‌త్యేక వాహ‌నాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసన సభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు ఢిల్లీకి బ‌య‌లుదేరారు. వీరు మార్చి 5వ తేదీ ఢిల్లీలో త‌ల‌పెట్టిన ధ‌ర్నాలో పాల్గొంటారు. అక్క‌డి నుంచి తిరిగి  7వ తేదీ రాష్ట్రానికి చేరుకుంటారు.  ధర్నా కార్యక్రమంలో పాల్గొనే పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం ఢిల్లీలో వసతి ఏర్పాట్లు చేశారు. 

Back to Top