వైఎస్సార్సీపీ నాయకుల రక్తదానం

గుంటూరుః డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారోత్సవాల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనాయకులు...పార్టీ కార్యాలయంలో రక్తదానం చేశారు. 
ఈసందర్భంగా హాజరైన వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగాలని యువత అంతా కోరుకుంటున్నారన్నారు. 

రాష్ట్రంలో చంద్రబాబు అంబేద్కర్ భావజాలానికి తూట్లు పొడుస్తున్నారని లేళ్ల మండిపడ్డారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించకపోతే బాబు చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు.  పవిత్రమైన విశ్వవిద్యాలయాల్లో కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విద్యార్థులు రెండు వర్గాలుగా చీలుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితులు నెలకొల్లాన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  
Back to Top