టీడీపీని "ఛీ" కొడుతున్నారు

  • బాబు మతిస్థిమితం కోల్పోయాడు..సీఎం పదవికి అనర్హుడు
  • కనకంబు సింహాసనంపై శునకముును కూర్చోబెట్టవచ్చా..?
  • మాకు ఓటేయకపోతే అభివృద్ధి చేయమని బాబు మాట్లాడడం సిగ్గుచేటు
  • బాబు, లోకేష్ ల అవినీతి, అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
  • తెలుగు ప్రజలంతా తెలుగుదేశం పార్టీని ఛీదరించుకుంటున్నారు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడః మతిస్థిమితం లేని వ్యక్తి సీఎం పదవికి అనర్హుడని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. నా పెన్షన్, నా రేషన్, నారోడ్లు, నా వీధిదీపాలపై ప్రజలు ఆధారపడుతున్నారని సీఎం స్థాయిలో ఉండి చంద్రబాబు అలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రేనా అని విమర్శించారు. కనకంబు సింహాసనంపై శుకమును కూర్చోబెట్టవచ్చో లేదో టీడీపీ నాయకులు ఆలోచన చేసుకోవాలన్నారు.  చంద్రబాబు వ్యాఖ్యలు, వ్యవహారశైలి చూస్తే మతిస్థిమితం కోల్పోయినట్టుగా ఉందన్నారు. ప్రజలు కట్టే పన్నులతోనే ప్రభుత్వ పథకాలు నడుస్తున్నాయన్నారు. అదేదో తన సొంత సొత్తు ఇచ్చినట్టు బాబు మాట్లాడడం అవివేకమన్నారు. చంద్రబాబు ఏరోజైనా నీ వ్యక్తిగత హోదాలో ఒక్క రూపాయి చందా ఇవ్వడం గానీ, చారిటీ చేయడం గానీ జరిగిందా...? హెరిటేజ్ క్యాష్ గానీ , ఎన్టీఆర్ ట్రస్టు నుంచి గానీ రాష్ట్ర ప్రజలకు ఏనాడైనా రూపాయి అందిందా అని ఎద్దేవా చేశారు. దోపిడీలకు లైసెన్స్ లిచ్చేవాడు, ప్రభుత్వ ఖజానాలు దోచుకునేవాడు ముఖ్యమంత్రి కాదని... ప్రభుత్వానికి, ప్రజలకు ధర్మకర్తగా ఉండేవాడు ముఖ్యమంత్రి అన్న సంగతి బాబు తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రే దగ్గరుండి తుంగలో తొక్కుతున్నాడని విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లంపల్లి ధ్వజమెత్తారు. 

చార్మినార్, సైబరాబాద్,  హైటెక్ సిటీ అన్నీ నేనే నిర్మించానంటూ బాబు మాట్లాడుతున్నారని...మరి అలాంటప్పుడు కేసీఆర్ కు అక్కడ పాలించే అర్హత ఉందో లేదో ఆయన ప్రశ్నించాలన్నారు.  మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయి ఏడేళ్లయినా ఈ రోజుకు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచారంటే...రాజకీయాలు, కుల, మత, ప్రాంతాలకతీతంగా ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనమన్నారు.  ఆరోగ్యశ్రీ, 108,104, ఫీజు రీయింబర్స్ మెంట్, మైనారిటీలకు రిజర్వేషన్ , ఎస్టీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలును అందించి వైయస్ఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారని గుర్తు చేశారు. కానీ, చంద్రబాబు అవినీతి, అక్రమాలే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని వెల్లంపల్లి దుయ్యబట్టారు. అవినీతి, అరాచకాలు, దుర్మార్గాలు చేయలేదని కాణిపాకం వినాయకుడిమీద ప్రమాణం చేసే దమ్ము ధైర్యం బాబు, లోకేష్ లకుందా అని సవాల్ విసిరారు. మాకు ఓటేయకపోతే అభివృద్ధి చేయమని ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మూడేళ్లలో ఏనాడు నంద్యాల ముఖం చూడని నీకు....అక్కడ ఎన్నికలొస్తున్నాయనగానే ముస్లింలు, నంద్యాల ప్రజలు గుర్కుకువచ్చారా బాబూ..? అని నిలదీశారు.  రాజకీయాల్లోకి రాకముందు రెండెకరాలున్న నీకు లక్షలాది కోట్లు ఎక్కడనుంచి వచ్చాయి బాబూ..? ఆవులు, గేదేలే కాదు దున్నపోతులకు కూడ పాలు పితికారేమో  అంటూ వెల్లంపల్లి ఎద్దేవా చేశారు.

జయంతికి, వర్థంతికి తేడా తెలియని వ్యక్తి, జాతీయ జెండా ఎగరవేసేటప్పుడు సెల్యూట్ చేయడం కూడ తెలియని వ్యక్తి మంత్రిగా ఉండడం దురదృష్టకరమని లోకేష్ పై నిప్పులు చెరిగారు. సినిమాకు వెళ్లినప్పుడు థియేటర్ లో జనగణమన పాడితే ప్రతి ఒక్కరూ లేచి పాడే సంస్కృతి మనదేశంలో ఉందన్నారు. లోకేష్ కు ప్రజల మీద, జాతీయ జెండా మీద ఎవరిమీద గౌరవం లేదన్నారు.  మాట్లాడితే ట్విట్టర్ ల ద్వారా లోకేష్ సవాల్ విసురుతున్నారు. మీ అవినీతిమీద సీబీఐ ఎంక్వైరీ వేసే దమ్ము, ధైర్యం ఉందా అని వైయస్ జగన్ ఒకే సవాల్ విసిరారు. దానికి స్పందించకుండా తండ్రీకొడుకులు జగన్  ఆస్తుల మీద మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. చీకట్లో చిదంబరంను కలిసి వైయస్ జగన్ పై అక్రమ కేసులు బనాయించింది మీరు కాదా అని బాబుపై నిప్పులు చెరిగారు. నంద్యాలలో వైయస్సార్సీపీ జెండా ఎగరవేసి ప్రజలు బాబుకు తగిన బుద్ధి చెబుతారని వెల్లంపల్లి స్పష్టం చేశారు. 

తన స్వలాభం కోసం ఉపయోగించుకుందామని ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణకార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన చంద్రబాబు...బాబు తప్పుడు పనులకు  అడ్డుపడడంతో చెప్పాపెట్టకుండా ఆయన్ను పదవి నుంచి తొలగించారన్నారు.  సోషల్ మీడియాలో టీడీపీ  నేతలు పెడుతున్న పోస్టింగ్ లు చూసి తెలుగు ప్రజలంతా తెలుగుదేశం పార్టీని ఛీఛీ అని ఛీదరించుకుంటున్నారని వెల్లంపల్లి అన్నారు.  బ్రాహ్మణకులంలో పుట్టిన  నిజాయితీ గల అధికారిని బాబు బాధపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటూరి రవికిరణ్ ను అరెస్ట్ చేసి హంగామా చేసిన బాబు... ఐవైఆర్ మీద పోస్టులు పెట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వెల్లంపల్లి నిలదీశారు. ఐవైఆర్ పై పోస్టులు పెట్టినందుకు గానూ బాబు, లోకేష్ ను అరెస్ట్ చేయాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తన వయసుకు తగినట్టుగా మాట్లాడితే బాగుంటుందని హితబోధ చేశారు. విశాఖ భూములను కబ్జా చేసిన నీకు విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత లేదని బండారుపై వెల్లంపల్లి ధ్వజమెత్తారు. వైయస్సార్సీపీ ఎమ్మెల్యే  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానికసమస్యలపై ధర్నాలు చేస్తుంటే..నిన్నటి నుంచి ఈ క్షణం వరకు అనేక పోలీస్ స్టేషన్ లను మార్చుతున్నారని,  బెయిల్ ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై పోరాడేవారి పట్ల  ప్రభుత్వం  చేస్తున్న వేధింపులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చెవిరెడ్డిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలోకి నీరు వచ్చిన ఘటనపై సీఐడీతో కేసును ప్రభుత్వం నీరుగార్చుతోందన్నారు. టీడీపీ సర్కార్ చేస్తున్న అన్యాయాలపై వైయస్సార్సీపీ పోరాడుతుందని వెల్లంపల్లి స్పష్టం చేశారు.  బాబు అరాచకాలు, లోకేష్ అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తగిన బుద్ధి చెబుతామన్నారు. 
Back to Top