అవమానించడమే చంద్రబాబు నైజం...

విశాఖః హామీలను తుంగలోకి తొక్కి అన్నివర్గాలను చంద్రబాబు మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు వరుదు కల్యాణి విమర్శించారు.గతంలో నాయీబ్రాహ్మణులు జీతం పెంచి న్యాయం చేయమని కోరితే తోకలు కత్తిరిస్తానంటూ వారిని అవమానపరిచారని, అలాగే మత్స్యకారులపై కూడా వివక్ష చూపారన్నారు.  ప్రస్తుతం అన్నివర్గాలకు వైయస్‌ జగన్‌ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌కు పట్టం కట్టడానికి ఆంధ్రరాష్ట్రం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. 2014  టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఒకోపేజీ కేటాయించారని  కనీసం ఒక హామీ కూడా నెరవేర్చలేదన్నారు. నేడు జరగబోయే ఆత్మీయ సదస్సుకు ముస్లింలు స్వచ్ఛందంగా తరలిరావడానికి సిద్ధమవుతున్నారన్నారు.
Back to Top