వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వుండ‌వ‌ల్లి శ్రీ‌దేవి
హైద‌రాబాద్‌:  గుంటూరు జిల్లా తాడికొండ నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ వుండ‌వ‌ల్లి శ్రీ‌దేవి శుక్ర‌వారం వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు.త‌న‌ను నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించింనందుకు ఆమె పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ‌, అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌దేవి మీడియాతో మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల కోసమే పాటుపడుతున్న వైయ‌స్‌ జగన్‌ను జనం నుంచి వేరు ఎవ‌రూ చేయలేరని పేర్కొన్నారు. జ‌న‌నేత‌కు వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణ చూసి ఓర్వేల‌క‌ విశాఖ విమానాశ్రయంలో గత నెల 25వ తేదీన జగన్‌పై  హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డార‌న్నారు.  హత్యాయత్నం ఘ‌ట‌న‌కు చంద్ర‌బాబు పూర్తి బాధ్య‌త వ‌హించాల‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ గెలుపు త‌ధ్య‌మ‌ని, వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మైంద‌న్నారు. ఈ విజ‌యాన్ని ఎవ‌రూ అడ్డుకోలేర‌న్నారు. జ‌న‌నేతను ముఖ్య‌మంత్రిని చేసేందుకు శాయ‌శ‌క్తుల కృషి చేస్తామ‌న్నారు. 


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top