దోచుకో..దాచుకో..ఇదే టీడీపీ పాలన

తూర్పు గోదావరి: చంద్రబాబు పాలన అంతా దోచుకో..దాచుకో అన్నట్లుగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ సూర్యనారాయణరెడ్డి విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  స్థానిక ఎమ్మెల్యే అవినీతి గురించి ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా చిన్న పిల్లాడు సూతం చెబుతారని తెలిపారు. ఇసుక, మట్టి, మద్యం నుంచి దోచుకున్నారని మండిపడ్డారు. దేవాలయానికి సంబంధించిన విరాళాలను కూడా దోచుకున్నారని ఆరోపించారు. ప్రతి టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే అవినీతికి తలదించుకుంటున్నారని తెలిపారు. వైయస్‌ జగన్‌ ఆశీస్సులతో, మీ అందరి ఆదరాభిమానాలతో ఏ పదవి చేపట్టినా నిజాయితీ పరుడు అన్న పేరు తెచ్చుకుంటానని, మీ అందరూ తల ఎత్తుకునేలా వ్యవహరిస్తానని చెప్పారు.
 
Back to Top