నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం

వైయస్‌ఆర్‌ జిల్లా: ముచ్చుమ్రరి ముంపు గ్రామాలకు న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని పార్టీ జమ్మలమడుగు ఇన్‌చార్జి డాక్టర్‌ సుధీర్‌రెడ్డి అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సుధీర్‌రెడ్డి ముచ్చుమ్రరి ముంపు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు పరిహారం ఇవ్వకుండా గండికోట రిజర్వాయర్‌ నీరు వదలడం దారుణమన్నారు. నిర్వాసితులకు పునరావాసం చూపకుండా ఖాళీ చేయాలనడం దుర్మార్గమన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం చేస్తుందన్నారు. 
Back to Top