సిద్ధాపురం వద్ద ‘వైయస్‌ఆర్‌ గంగా హారతి’

 

కర్నూలు: కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వద్ద త్వరలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున వైయస్‌ఆర్‌ గంగా హారతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నంద్యాల వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి  వెల్లడించారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చలువే అన్నారు. ఈ పథకానికి భూమి పూజ చేసి, నిధులు కేటాయాఇంచింది మహానేతే అన్నారు. అయితే ఈ పథకాన్ని తాను పూర్తి చేశానంటూ స్థానిక ఎమ్మెల్యే చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ ఘనత వైయస్‌ఆర్‌కు తప్ప మరెవరికీ దక్కదని చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు. మహానేత వల్లే ఈ పథకం సాధ్యమైనందుకు ఆయన పేరిట గంగాహారతి పేరుతో పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు.
 
Back to Top