ప‌వ‌న్‌..ఏం ప్రశ్నించావ్‌...ఏం సాధించావ్ ?

 

ఏ సమస్యపైనైనా చివరి దాకా పోరాటం చేశావా..
పవన్‌..సినిమాలకు,రాజకీయాలకు తేడా తెలుసుకో..
ఆశావర్కర్లను ఈడ్చి కొట్టించి..ఇప్పుడు ఓట్లు అడుగుతావా బాబూ?...
చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లపై వైయస్‌ఆర్‌సీపీ నేత పేర్ని నాని ధ్వజం..
విజయవాడః టీడీపీ ప్రభుత్వ నాలుగున్నరేళ్లలో ఆశవర్కర్లను కాల్చుకుతినడం తప్ప వారి సంక్షేమం గురించి పట్టించుకోలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత పేర్ని నాని అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఎన్నిసార్లు ఆశావర్కర్లు పోరాటాలు, ఉద్యమాలు చేసిన చంద్రబాబు చలించలేదన్నారు. ఎన్నికల వస్తున్న తరుణంలో ఆశావర్కర్లను పిలిచి వారిని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.పుట్టిన బిడ్డకు కూడా నాకు ఓటు వేయాలని చెపాల్పని చంద్రబాబు వ్యాఖ్యలు హస్యాస్పదమన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు విచక్షణగా మాట్లాడుతున్నారా, మానసికంగా మతి చెడి మాట్లాడుతున్నారా అనే అనుమానం కలుగుతుందన్నారు. ఆశావర్కర్లు కౌశుని గురించి శ్రీకృష్ణునికి కడుపులో ఉన్నప్పుడు ఎలాగయితే తల్లి  చెప్పిదో చంద్రబాబు గురించి ఆ రకంగా చెబుతారు తప్పితే..చంద్రబాబు గురించి మంచి గురించి చెప్పె పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు.ఆశవర్కర్ల ఆలనాపాలనా గురించి ఆలోచించారా అని అన్నారు.ఆశవర్కర్లును నిబంధనలకు విరుద్ధంగా మగ పోలీసుల చేత అసభ్యకరంగా ఈడ్చికొట్టించిన చంద్రబాబుకు ఎన్నికల తరుణంలో వారు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారన్నారు.చంద్రబాబుకు,  కంశుడుకు  తేడా లేదని  పుట్టిన బిడ్డలకు బెబుతామంటూ ఆశవర్కర్లు అంటున్నారన్నారు. మగ పోలీసులతో లాఠీచార్జీ చేయించడం ఆశావర్కర్లు మరిచిపోలేదన్నారు. నాలుగున్నర సంవత్సరాలపైగా చంద్రబాబు, మోదీతో పవన్‌కల్యాణ్‌ కాపురం చేశారని, గత ఎన్నికల ముందు చంద్రబాబు,మోదీకి ఓటు వేయాలని పిలుపునిచ్చి మీ ఓటు ద్వారా వారిని ప్రశ్నిస్తాను అని తెలిపారని,ప్రశ్నించడం కోసమే జనసేనా పార్టీని పెట్టానని నన్ను నమ్మి ఓటు వేయాలని  చెప్పి నాలుగున్నరేళ్లుగా పవన్‌ కల్యాణ్‌ నిద్ర నటించారని తెలిపారు. సినిమాల్లోనే మగతనం ఉంటుందని  రాజకీయాల్లో మగతనం ఉండదన్నారు. రాజకీయాల్లో పోరాట తత్వం, రాజకీయ నైజం వుంటుందన్నారు. పవన్‌కల్యాణ్‌ గ్రహించాలన్నారు.సినిమాలకు, రాజకీయాలకు తేడా తెలుసుకోవాలని సూచించారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను భూజాన్నికెత్తుకున్న పవన్‌కల్యాణ్‌ ఏం పరిష్కరించారని ప్రశ్నించారు. ఒక పైసా అయినా ప్రభుత్వంతో ఇప్పించారా సమాధానం చెప్పాలన్నారు.ఇంకా అనేక సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి ఏం సాధించారో చెప్పాలన్నారు. రాజధాని భూముల విషయంలో ఏం పరిష్కారం చేశారని ప్రశ్నించారు.పవన్‌ కల్యాణ్‌  మాటలు నమ్మి రైతులందరూ కోర్టులు చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫాతిమా కాలేజి విద్యార్థులకు  న్యాయం చేశారా..ఉద్ధానం బాధితులకు ఏం చేశారని, సీపీఎస్‌ సమస్య పరిష్కరించారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ సమస్యపైనా చివరి దాకా పోరాడలేదని పవన్‌కల్యాణ్‌ను విమర్శించారు.ఆక్వా బాధితులను నాటకీయంగా అక్కున చేర్చుకుని వారికి ఏవిధమైన న్యాయం చేశారో చెప్పాలన్నారు. ప్రశ్నించే పార్టీ ఏం చేస్తోందని ప్రశ్నించారు.

Back to Top