<strong>అర్ధరాత్రి రాష్ట్ర పాలన..పగటిపూట కాంగ్రెస్ ఆలనాపాలనా</strong><strong>తుపాన్ తీవ్రతను సమీక్షించకుండా దేశ పర్యటనలా..</strong><strong>రాష్ట్రం గాలిలో కొట్టుకుపోయినా పట్టదా..</strong><br/>విజయవాడః తుపాను ప్రభావిత రైతులను ఆదుకోవలసిన సీఎం చంద్రబాబు గాలికొదిలి దేశ పర్యటనలు చేయడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థసారధి విమర్శించారు.లక్షల ఎకరాలలో ఇంకా కోతలు పూర్తికాలేదు.కోతలు కోసి పోగులు పెట్టి వరిపంట ఉందని, ఇంకా కుప్పల వేసిన పరిస్థితులు ఉన్నాయని, ధాన్యమంతా కళ్లాలలోనే ఉందని ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు ఆసరాగా ఉండి భరోసా కల్పించవలసిన ప్రభుత్వాధినేత పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఏపీలో క్షుద్ర పాలన జరుగుతోందని, సాధారణంగా క్షుద్ర పూజలు అర్ధరాత్రి సాగుతాయని చంద్రబాబు కూడా అర్ధ్రరాతి పూట అప్పటికప్పడు అధికారులను పిలుచుకుని మొక్కుబడిగా నాలుగు మాటలు చెప్పి ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇచ్చేసి తన పని పూర్తి అయిపోయిందని చేతులు దులుపుకుంటారన్నారు. చంద్రబాబుకు పాలన అనేది అఖరి ప్రాధాన్యాంశం అని,ఆయనకు రాజకీయాలు, ఇతర పార్టీలతో సంబంధాలు అవే ప్రాధాన్యత తప్పితే రాష్ట్ర ప్రజలు సమస్యలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను తీవ్రత బట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాల్సిన ముఖ్యమంత్రికి అన్నింటికంటే ముఖ్యమైన పని ఏమిటంటే ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రమాణాస్వీకారోత్సవాల్లో పాలు పంచుకోవడం అని దుయ్యబట్టారు. చంద్రబాబు తీరు చూస్తే.. అర్ధరాత్రి రాష్ట్ర పాలన..పగటిపూట కాంగ్రెస్ ఆలనాపాలనా లాగా ఉందని ఎద్దేవా చేశారు. నిన్న తమిళనాడుకు కరుణానిధి విగ్రహావిష్కరణకు చంద్రబాబు వెళ్ళారని, నేడు మధ్యప్రదేశ్ ముఖ్యమ్రంతి ప్రమాణాస్వీకారానికి, రేపు రాజస్థాన్ ముఖ్యమంత్రి ప్రమాణాస్వీకారానికి ఇలా దేశప ర్యటనల్లో చంద్రబాబు బీజీగా ఉన్నారని, రాష్ట్రం గాలిలో కొట్టుకుంటుందన్నారు. మీ చావు మీరు చావండి అని చెప్పినట్లు చంద్రబాబు తీరు ఉందని విమర్శించారు. తుపాన్ వచ్చే ముందు చంద్రబాబు పనిచేయరు. తుపాన్ వచ్చిన తర్వాత అధికారులు పనిచేయరు. తుపాన్ తర్వాత తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హడావుడిగా కాన్వాయ్‌లో తిరుగుతూ ఎటువంటి ఫలితాలు లేని కార్యక్రమాలు చేస్తూ అధికారులను కూడా తికమకపెడుతూ వారి పని వాళ్లను చేసుకోనివ్వకుండా ఈయన వెనకాల తిప్పుకుంటాడు. పూర్తిగా వైఫల్యం చెందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేదంటారు. లేకపోతే పెథాయ్‌ను జయించిన ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయించుకుంటారు అని చురకలు అట్టించారు. తుపాన్ ప్రభావంతో రైతులు,ప్రజలు ఆందోళనలో ఉంటే మంత్రులు కూడా రాష్ట్రంలో లేరు. హైదరాబాద్‌లో వ్యక్తిగత కార్యక్రమాల్లో ఉన్నారని మండిపడ్డారు. అత్యావసర పరిస్థితి అని ప్రటించిన ప్రభుత్వాధినేత కూడా రాష్ట్రంలో లేరు. మంత్రులు లేరన్నారు. రైతులకు ఏ విధంగా నష్టం తగ్గించవచ్చో క్షేత్ర స్థాయిలో పర్యటించి సూచనలు ఇవ్వాలని అధికారులన సూచించారు.రైతులకు అన్యాయం చేయవద్దని, భరోసా కల్పించాలని కోరారు. గతంలో వచ్చిన తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు. పారదర్శకంగా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రైతులు జ్ఞాపకం చేసుకుని ఎక్కువగా దిగులు చెందుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ రైతులకు అండగా ఉంటుందని తప్పకుండా నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. నేటికి ఒక శాఖమంత్రి కూడా ఎక్కడ సమీక్షలు నిర్వహించలేదని కేవలం విమర్శించడానికే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. పర్యటనలు కూడా చేయకుండా కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతున్నారన్నారు. వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే మూడు,నాలుగు నెలల్లో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని నష్టపోయిన రైతులందరికి న్యాయం చేస్తామని తెలిపారు.