ఓటుకు నోటు కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి

ఏపీలో లా అండ్‌ అర్డర్‌ కుంటుపడింది..
వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
విజయవాడః ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను  కాపాడుకోలేని చంద్రబాబు ఆ నెపాన్ని ప్రతిపక్షంపైకి నెట్టడం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు.కిడారి, సోమలను కాపాడలేని సర్కార్‌  ప్రతిపక్షంపై బురదజల్లుతోందన్నారు. దోపిడీ కోసం మైనింగ్‌ చట్టాలను మార్పుచేసింది మీరు కాదా...బాక్సైడ్‌ తవ్వకాలకు జీవో జారీ చేసింది మీరు కాదా అనిప్రశ్నించారు. ఈ పాలనలోనే  కరువు వస్తుందని,  రాయలసీమ ఎడారిలా మారిపోతుందన్నారు. టీడీపీ ప్రభుత్వ  వైఫల్యాలు మూలంగా రాష్ట్రంలో పూర్తిగా లా అండ్‌ అర్డర్‌ కుంటుపడిందన్నారు. ఓటుకు కోట్లు కేసుపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.
Back to Top