విజయనగరంః గిరిజనులంతా వైయస్ జగన్ వెంట ఉన్నారని అరకు పార్లమెంటరీ సమన్వయ కర్త శత్రుచర్ల పరిక్షిత్ రాజు అన్నారు. గిరిజనుల పట్ల టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు.సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తోందన్నారు. విష జర్వాలు ప్రబలి గిరిజనులు మరణిస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. వైయస్ జగన్ పాదయాత్రలో ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటున్నారన్నారు. ఉపాధి అవకాశాలు క్షిణించడంతో వలసలు పెరిగాయన్నారు. విద్య,వైద్య సౌకర్యాలను మెరుగుపర్చకపోవడంతో వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. హత్యాయత్నం జరిగిన తర్వాత జరుగుతున్న పాదయాత్రలో వైయస్ జగన్‌లో ధైర్యం నింపడం కోసం దారిపొడవునా ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. <br/>