రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు. గవర్నర్‌ ప్రసంగంలో వ్యవసాయంపై చంద్రబాబు అసత్యాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  మెట్టప్రాంతంలో వేసిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు. కర్నాటక, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వమే పంటలు కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు. మినుములు, పెసలు, జొన్నలు, మొక్కజొన్న, వేరుశనగ పంటలకు మద్దతు ధర లేదన్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశామని ప్రచారం చేస్తున్నారు తప్ప..పండించిన పంట కొనుగోలు చేయడం లేదని, టీడీపీ నేతలు దళారుగా మారి దోచుకుంటున్నారని విమర్శించారు. రైతులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. గిట్టుబాటు ధరకు పంటను కొనిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. అయితే అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంలో వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు సాధించిందని తప్పుడు లెక్కలు చెప్పించారని మండిపడ్డారు. మొదటి 6 నెలల్లో ఒక్క పంట కూడా పంట చేతికి అందదన్నారు.
 
Back to Top