ఆదరణ పేరుతో అరచేతిలో వైకుంఠం

కత్తెరలు,  ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి మరోసారి మోసం చేయలేరు
బీసీలను అణచివేసేలా చంద్రబాబు ఆదరణ పథకం
నాయీ బ్రాహ్మణులను, మత్స్యకారులను బాబు అవమానించారు
బీసీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం కావాలని బాబు కుట్ర
వైయస్‌ఆర్‌ పథకాలకు తూట్లు పొడించింది టీడీపీ ప్రభుత్వమే
110 హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా బాబూ?
బీసీల అభివృద్ధికి వైయస్‌ఆర్‌ సీపీ కట్టుబడి ఉంది
త్వరలో వైయస్‌ జగన్‌ నాయకత్వంలో బీసీ గర్జన
విజయవాడ: ఆదరణ పేరుతో అరచేతిలో వైకుంఠం చూపిస్తూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నాడని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. బీసీ సామాజిక వర్గాలకు కత్తెరలు, ఇస్తీ్ర పెట్టెలు, మోకు, కత్తులు, వలలు, ఇంజన్లు ఇచ్చి మోసం చేయాలని చూస్తున్నాడన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మోపిదేవి వెంకటరమణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రకటనలకు, బీసీ సమాజిక వర్గానికి జరుగుతున్న మేలుకు ఎక్కడా పొంతనలేదన్నారు. అనేక రకాల సమస్యలతో బలహీనవర్గాలు కొట్టుమిట్టాడుతుంటే.. వాటిని పరిష్కరించాల్సిన చంద్రబాబు అంతా అభివృద్ధి పరిచామంటూ అబద్ధాలు వల్లిస్తున్నాడన్నారు. అదిరిందయ్యా.. ఆదరణ, జయహో బీసీ అంటూ తన అనుకూల పత్రికల్లో కథనాలు రాయించుకుంటున్నాడన్నారు. ఆదరణ పథకం ద్వారా కులవృత్తులపై ఆధారపడి జీవించే వారికి నాయీ బ్రాహ్మణులకు కత్తెరలు, రజకులకు  ఇస్త్రీ  పెట్టెలు, గీత కార్మికులకు మోకు, కత్తులు, మత్స్యకారులకు వలలు, ఇంజన్లు అందిస్తానని చెప్పుకుంటున్నాడన్నారు.

ఆదరణ పథకం ద్వారా అందించే పరికరాల ఖర్చు కంటే పత్రికల ప్రకటనలు, పబ్లిసిటీల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ఆ పరికరాల కూడా కొన్ని ప్రాంతాల్లోనే టీడీపీ కార్యకర్తలుగా ఉన్నవారికే అందిస్తున్నారన్నారు. సహజంగా చంద్రబాబు ఎప్పుడూ ఎన్నికలకు ముందు బలహీనవర్గాలను మోసం చేసేందుకు రకరకాల ప్రకటనలు చేయడం.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని గాలికివదిలేయడం సర్వసాధారణమన్నారు. అమాయక ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. ఆధునిక పనిముట్లు అంటున్న చంద్రబాబు దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 2003 ఎన్నికలకు ముందు ఆదరణ పథకాన్ని తీసుకొచ్చి పరికరాలను టీడీపీ కార్యకర్తలకు అందజేసి కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ చేయించుకున్నాడని గుర్తు చేశారు. 

బీసీలు అంటే చంద్రబాబు దృష్టిలో బ్యాక్‌వర్డ్‌ క్లాసెసా, బాబు గారి క్లాసెసా, బిజినెస్‌ క్లాసెసా.. ఈ మూడింటిలో ఏ కేటగిరికి చెందిన వారో వివరణ ఇవ్వాలని చంద్రబాబును ప్రశ్నించారు. 2014 ఎన్నికల ముందు బీసీలకు చంద్రబాబు 110 వాగ్దానాలు ఇచ్చారని, కొన్ని వర్గాలను బీసీల్లో చేర్చుతామని, బీసీలో ఉన్నవారిని ఎస్టీల్లో చేర్చుతానని రకరకాల హామీలు కుల రాజకీయాలకు తెర తీశాడని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క పథకమైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అమలు చేసిన పథకాలతో నా కుటుంబం సంతోషంగా ఉందని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలిగేవారు పదిమంది అయినా ఉన్నారా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. 

బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని చంద్రబాబు దారుణంగా అవమానించారని మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. నాయీ బ్రాహ్మణులను దుర్గమ్మ తల్లి సాక్షిగా అవమానించారని, మత్స్యకారులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని అడిగినందుకు తాటతీస్తానంటూ బెదిరించి కించపరిచారన్నారని మండిపడ్డారు. చేనేత కార్మికులకు ఉపయోపగే ఆప్కో సంస్థ కూడా చంద్రబాబు హయాంలోనే మూతపడిందన్నారు. అదే విధంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టి జనతా వస్త్రాలను తెరమరుగు చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. షిఫరిస్‌ కార్పొరేషన్, బీసీ వెల్ఫేర్‌ కార్పొరేషన్లను అస్తవ్యస్థం చేశారన్నారు. బీసీ సామాజిక వర్గాలకు ఉపయోగపడే సంస్థలు నిర్వీర్యం చేసింది చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదరణ పథకం ద్వారా నాలుగు ఇస్తీ్ర పెట్టెలు, కత్తెరలు ఇస్తే జీవితాలు బాగుపడతాయని మాట్లాడడం బీసీ వర్గాలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 

బడ్జెట్‌లో కేటాయించిన రూ. వేల కోట్లకు దొంగ లెక్కలు చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.  2014–15 రూ. 3129 కోట్లు, ఖర్చు చేసింది రూ. 3122 కోట్లు, 2015–16 రూ. 3231 కోట్లు ఖర్చు చేసింది 3720, 2016 నుంచి 2018కి దాదాపు రూ. 5 వేల కోట్లు చూపించారు. ఖర్చు కూడా అదే రీతిలో చూపిస్తున్నారన్నారు. ఆ బడ్జెట్‌ మారుమూల ప్రాంతాలకు చెందిన పది మందికి ఉపయోగపడ్డాయా.? అని ప్రశ్నించారు. సబ్‌ ప్లాన్‌ ద్వారా 12,200 కోట్లు చూపిస్తున్నారు. బడ్జెట్‌లో కేటాయించిన పద్దుల వల్ల, సబ్‌ప్లాన్‌ పద్దుల వలన ఎక్కడైనా గానీ ప్రయోజనాలు కలిగాయా..? కానీ అంకెలు మాత్రం బ్రహ్మండంగా చూపిస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారని మండిపడ్డారు.  

సమాజంలో ఇక బతికినంత వరకు బీసీలు ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలనే రీతిలో చంద్రబాబు రాజకీయాలు ఉన్నాయని మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. బీసీలు ఎక్కడా గౌరవంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఆంధ్రరాష్ట్రంలో లేకపోవడం దారుణమన్నారు. ఎన్నికలు దగ్గరకొచ్చాయని మైనార్టీ, ఎస్టీకి మంత్రి పదవులు ఇచ్చారని, బీసీలకు ఆదరణ పేరుతో కోట్లు ఖర్చుచేసి రకరకాల ప్రకటనలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బలహీనవర్గాలకు చెందిన వ్యక్తికి ఉపయోగపడే పథకం ఒక్కటైనా తీసుకొచ్చారా చంద్రబాబూ అని ప్రశ్నించారు. విద్యా పరంగా ప్రయోజకులను చేసే పథకాలు, బలహీనవర్గాలకు చెందిన వ్యక్తికి దీర్ఘకాలిక వ్యాధి వస్తే దాన్ని నయం చేసేందుకు మెరుగైన పథకాలు ప్రవేశపెట్టినప్పుడే సమాజం హర్షిస్తుంది. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పేద విద్యార్థులు చదువుకునేందుకు ఫీజురీయింబర్స్‌మెంట్, ప్రజలు ఆరోగ్యంగా జీవించాలని ఆరోగ్యశ్రీ వంటి పథకాలను తీసుకొచ్చి చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా తాపీ మేస్త్రీ కొడుకు డాక్టర్, కూలీ కొడుకు ఇంజినీర్‌ అయ్యాడన్నారు. వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని చంద్రబాబు మొత్తం నాశనం చేశాడని విరుచుకుపడ్డారు. కొన్ని సామాజిక వర్గాలను ఎస్టీల్లో చేర్చుతూ తీర్మానం చేశామని చెబుతున్నారని, కేబినెట్‌లో తూతూ మంత్రంగా తీర్మానాలు చేసుకున్నారు తప్ప శాశ్వతంగా ఆ సమస్యకు పరిష్కారం కనుచూపెమురల్లో కనిపించడం లేదన్నారు. 

చంద్రబాబు చెప్పినవన్నీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, ఎవరు అధికారంలోకి వస్తే ఏ ప్రయోజనాలు జరుగుతాయనే ఆలోచించే స్థితికి వచ్చారన్నారు. రాష్ట్రం మొత్తం ఉన్న బీసీల సమస్యలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిని శాశ్వతంగా పరిష్కరించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక కమిటీని నియమించారని చెప్పారు. ఆ కమిటీ సమస్యలపై నివేదిక తయారు చేస్తుందన్నారు. త్వరలోనే వైయస్‌ జగన్‌ నాయకత్వంలో బీసీ మహాగర్జన ఉంటుందని, ఆ సభలో బీసీల అభివృద్ధికి చేయబోయే పథకాల గురించి వైయస్‌ జగన్‌ వివరిస్తారని చెప్పారు. బీసీలను అభివృద్ధికి వైయస్‌ఆర్‌ సీపీ కట్టుబడి ఉందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top