బీసీలను టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంది..

విజయనగరంః బీసీ డిక్లరేషన్‌లో వైయస్‌ఆర్‌సీపీ స్పష్టమైన విధానంతో ముందుకెళ్తుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ అన్నారు. చంద్రబాబు ఓటు బ్యాంకు కోసమే బీసీలను వాడుకున్నారే తప్ప శాశ్వతమైన ప్రయోజనాలు కల్పించలేదని మండిపడ్డారు.బీసీ సామాజిక వర్గానికి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో న్యాయం జరిగిందన్నారు.టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఒక వాగ్దానం కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజా సంకల్పయాత్ర ద్వారా వైయస్‌ జగన్‌ ప్రాంతాలు, సామాజీకవర్గాల వారీగా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రణాళికలు వేస్తున్నారన్నారు.బీసీ అధ్యయన బృందం రాష్ట్రంలో పర్యటనలు చేస్తుందని,బీసీలను రాజకీయం,ఆర్థిక,విద్య పరంగా ఆదుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.తాత్కాలిక చర్యలతో బీసీ సామాజిక వర్గాలను టీడీపీ ప్రభుత్వం మభ్యపెడుతుందే తప్ప వారి శాశ్వతమైన అభ్యున్నతికి కృషిచేయడంలేదన్నారు. కులవృత్తుల వారీగా విడగొట్టి తాయిలాలు ఇస్తుందే తప్ప అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందేవిధంగా లబ్ధి చేకూర్చడంలేదన్నారు. బీసీల అభివృద్ధికి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో స్పష్టమైన దిశదశతో వైయస్‌ఆర్‌సీపీ ముందుకెళ్తుందన్నారు.
 
Back to Top