బాబు పాలనను టీడీపీ నేతలే నమ్మడం లేదు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి
వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన కొండా గీత, కొండా సిద్దార్థ

విజయనగరం: చంద్రబాబు పాలనను టీడీపీ నేతలే నమ్మడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. అందుకు కొండా సిద్దార్థ కుటుంబం వైయస్‌ఆర్‌ సీపీలో చేరడమే నిదర్శనమన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తంబళ్లపల్లి నియోజకవర్గ పీటీ మండల ఎంపీపీ కొండా గీతమ్మ, కొండా సిద్దార్థ అనుచరులతో కలిసి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. 40 ఏళ్ల పాటు టీడీపీలో ఉన్న కీలక నేతలు వైయస్‌ఆర్‌ సీపీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లి సమన్వయకర్త ద్వారకానాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

కొండా సిద్ధార్థ కుటుంబం టీడీపీని వీడిందంటే చంద్రబాబు ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందని మిథున్‌రెడ్డి అన్నారు. హత్యాయత్నం జరిగినా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా హుందాగా వ్యవహరించారన్నారు. చంద్రబాబులా పబ్లిసిటీ కోసం పాకులాడకుండా ప్రజలను సంయమనం పాటించేలా వైయస్‌ జగన్‌ చేశారన్నారు. టీడీపీ మోసాలు బయటకు తెలుస్తున్నాయని, అందుకే టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీలో విలువలు లేవని, పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు గౌరవం లేదని కొండా సిద్దార్థ అన్నారు. 
Back to Top