రాష్ట్ర్రానికి వైయస్‌ జగన్‌ నాయకత్వం అనివార్యం

బ్రాహ్మణ  వ్యతిరేకి చంద్రబాబు
వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు
టీడీపీ కర్కశపాలనలో అప్రజాస్వామికం రాజ్యమేలుతున్న తరుణంలో వైయస్‌ జగన్‌ నాయకత్వం రాష్ట్రానికి అనివార్యమని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు.విశాఖ జిల్లా  సిరిపురంలో చైతన్యనగర్‌లో బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. వ్యతిరేక నిర్ణయాలతో బ్రాహ్మణ జాతి మీద టీడీపీ పగబట్టిందని విమర్శించారు. ఆంధ్రరాష్టంలో కరణం వ్యవస్థ రద్దు చేయడం నుంచి నేటి వరుకూ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అణచివేసే చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో అర్చకులకు రిటైర్మెంట్‌ లేదని ప్రకటించిన చంద్రబాబు∙రమణ దీక్షితులను ఎందుకు తొలగించాలో చెప్పాలని ప్రశ్నించారు. ఐవిఆర్‌ ను ఎందుకు తొలగించారో చెప్పి  క్షమాపణ  చెప్పాలన్నారు.. ప్రతి వ్యక్తికి, ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసిన మహోన్నత వ్యక్తి మహానేత దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అయితే కులాల కార్పొరేషన్లు పెట్టి అరకొరగా నిధులు కేటాయిస్తున్న ఘనత చంద్రబాబుదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 9 అంశాలు పెట్టి ఒక అంశాన్ని కూడా పూర్తి చేయలేదన్నారు. సామాన్యులు చదువుకోవడానికి లక్ష నుంచి 3లక్షల పెంచుతామని చెప్పిS 30 వేల రూపాయాలకు తీసుకెళ్లాలన్నారు.కార్పొరేషన్‌ ద్వారా 500 కోట్లు కేటాయిస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో కనీసం 200 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. పింఛన్లు, ఫీజు రియంబర్స్‌మెంటులో ఆ నిధులు ఖర్చుచేసి ప్రభుత్వం దగా చేస్తుందన్నారు.   కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో  పెద్దలు దేవాలయానికి ఐదు ఎకరాలు  పోలం ఇస్తే తెలుగుదేశం పార్టీ నేతలు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో మొదటిగా అర్చకులు, పురోహితులు, దేవాలయాల భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నామన్నారు. 
Back to Top