<strong>జగన్ కావాలి..రాజన్న రాజ్యం రావాలి..</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు.</strong>విజయనగరంః సాగునీటి ప్రాజెక్టుల నుంచి సంక్షేమ పాలన వరుకూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని విజయనగరం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు.చంద్రబాబు నాలుగేన్నరేళ్ల పాలనలో జిల్లా పట్ల వివక్ష చూపించారని మండిపడ్డారు. జిల్లాలో 25 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తున్నా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్నారు. రైతులను ఆదుకోవాలనే ఆలోచన లేదన్నారు. రేపటితో ప్రజా సంకల్పయాత్ర ముగిస్తుందన్నారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి కావాలని, మళ్లీ రాజన్న రాజ్యం రావాలని జిల్లాలో ప్రజలందరూ ఒకేఒక ఆలోచన చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమయిందన్నారు.