విజయనగరంః టీటీపీ ప్రభుత్వం నాలుగేన్నర ఏళ్లు పాలన అంతా అవినీతిమయం అయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ చీపురుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్ అన్నారు. గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని, జిల్లా అంతా కళకళలాడుతూ ఉండేందన్నారు. చీపురపల్లి నియోజకవర్గంలో తోటపలి ప్రాజెక్టు, జూనియర్ కాలేజి,డిగ్రీ కాలేజి, 100 పడకల ఆసుప్రతి.వెటర్నరి యూనివర్శిటీ భవనాలు, రహదార్లు, 150 కోట్ల సుజల స్రవంతి ప్రాజెక్టులు వైయస్‌ఆర్ హయాంలో తీసుకువచ్చారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.టీడీపీ కార్యకర్త నుంచి నాయకుల వరుకు అవినీతిలో మునిగిపోయారన్నారు. ఉద్యోగాలు కూడా అమ్ముకుంటున్నారని విమర్శించారు. టీడీపీ ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.