నిందితుడు కత్తితో రెండోసారి పొడవాలని చూశాడు
కత్తికి విషయం పూశారనే అనుమానం కలుగుతోంది
విశాఖపట్నం: కుట్రపూరితంగానే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై హత్యాయత్నం చేశారని వైయస్‌ఆర్ సీపీ సీనియర్ నాయకుడు కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. విశాఖ విమానాశ్రయంలోని లాంజ్‌లో వైయస్ జగన్ కాఫీ తాగుతుండగా సిబ్బంది వచ్చి సమయం అయిందని చెప్పడంతో వైయస్ జగన్ కాఫీ కప్పు పక్కనబెట్టి లేచారు. రెస్టారెంట్ సిబ్బంది డ్రెస్‌లో ఉన్న ఒక కు్రరాడు సెల్ఫీ కావాలని చెప్పి దగ్గరకు వచ్చి పొడిచాడన్నారు. ఆ కత్తిని లాక్కునే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే మళ్లీ రెండోసారి పొడిచేందుకు యత్నించాడన్నారు. వైయస్ జగన్ మెడ కట్ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాడని కానీ వైయస్ జగన్ వెనక్కు వెళ్లడంతో కత్తి ఎడవ భుజానికి గట్టిగా తగిలిందన్నారు. రక్తస్త్రావం కావడంతో తన కండువాను భుజానికి కట్టే క్రమంలో ఎయిర్‌పోర్టు అథారిటీ వారు వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశారన్నారు. నిందితుడిని పోలీసులు లాక్కుని వెళ్లిపోయారన్నారు. నిందితుడు పొడిచిన కత్తికి విషయం పూసి ఉంటారనే అనుమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.