<strong>ఫిరాయింపు ఎమ్మెల్యే,ఎంపీలకు తగిన గుణపాఠం చెప్పాలి..</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్...</strong>విశాఖజిల్లాః వైయస్‌ఆర్‌సీసీ అధికారంలోకి రాగానే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.విశాఖ జిల్లా పాడేరులో వైయస్‌ఆర్‌సీపీ పార్టీ కార్యాయలం ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్‌పై గల ఆదరాభిమానాలతో ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరి,ఎంపీగా గీతను గెలిపిస్తే వ్యక్తిగ లబ్ధి కోసం అమ్ముడుపోయి పార్టీ ఫిరాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే,ఎంపీలు అభివృద్ధి ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు.వీరికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఆదివాసీల ప్రగతికి వైయస్‌ఆర్‌సీపీ అహర్నిశలు శ్రమిస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి వైయస్‌ఆర్‌సీసీ శ్రేణులంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. <br/>