జగనన్న రావాలి..ప్రతి ఇంటికి నవరత్నాలు కావాలి


విజయనగరం: వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని, ప్రతి ఇంటికి నవరత్నాలు కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు బొత్స ఝాన్సీ అన్నారు. కురుపం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె  మాట్లాడారు. జగనన్న జైత్రయాత్రను చూసి ఓర్వలేక వణకిపోతున్న టీడీపీ నేతలను ఎదురించి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రాణానికి హాని ఉన్నా లెక్క చేయకుండా మన కోసం వచ్చిన వైయస్‌ జగన్‌కు ఆత్మీయంగా ఆహ్వానిద్దామని, ఆశీర్వదిద్దామని కోరారు. ఎక్కడైతే వ్యవసాయానికి భూములు ఉన్నాయో ఆ భూముల్లో పోడు వ్యవసాయం చేయకూడదని ఆంక్షలు పెట్టారన్నారు. గిరిజనులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నాడు బీడు భూములను సాగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఉపాధి హామీలో ప్రత్యేక ఉప చట్టం తెచ్చారని, ఆమ్‌ ఆద్మీ పథకంతో ఎంతో మందికి మేలు చేశారన్నారు. గిరిజనులు, రైతులకు వైయస్‌ఆర్‌ తోడుగా ఉండేవారన్నారు.ఈ రోజు రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. అటవీ ప్రాంతంలో ఔషద మొక్కలకు అనుకూలంగా ఉన్న ప్రాంతమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఔషద మొక్కల సాగును నీరుగార్చారన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో భూమి లేని ప్రతి గిరిజనుడికి భూమి ఇచ్చారని గుర్తు చేశారు. సంక్షేమం అంటే తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, అంగన్‌వాడీలకు భవనాలు, పీహెచ్‌సీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు అనేకంగా ఏర్పాటు చేశారన్నారు. టీడీపీ పాలనలో సంక్షేమ పథకాలు అందడం లేదని విమర్శించారు. ఒక్క తెల్లకార్డు కూడా కొత్తగా ఇచ్చింది లేదని మండిపడ్డారు. మోసపూరితమైన ప్రభుత్వం, ప్రజా పాలనను పక్కన పెట్టి స్వార్థంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ వద్దని ఎందుకు జీవో తెచ్చారని ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుధుడికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రాజన్న పాలన రావాలంటే వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగనన్న రావాలి..ప్రతి కుటుంబానికి నవరత్నాలు కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. 
 
Back to Top