<strong>వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి</strong>శ్రీకాకుళంఃసంక్షేమ పథకాలు పచ్చకార్యకర్తలకే ప్రజలకు అందడం లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజావంచన తప్ప అభివృద్ధి లేదన్నారు.రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న బాబు మాటలు నమ్మేస్థితిలో జనం లేరన్నారు.తన అనుభావన్నంతా చంద్రబాబు తన తాబేదారుల అభివృద్ధికి వాడుకున్నారన్నారు.ఆరు వందలకు పైగా హామీలిచ్చి ప్రజలందర్నీ మోసం చేశారని మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. చంద్రబాబు పాలనంతా దోచుకోవడానికే వినియోగించాడని ధ్వజమెత్తారు. తన పచ్చమీడియాతో తన కన్న గొప్ప పాలకుడు లేడని పొగుడించుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.ప్రజలకు ఏవిధమైన మేలు చేయకుండా అన్ని చేసినట్లు భ్రమ కలిగిస్తున్నారన్నారు.ఇంత పచ్చి దగాకోరు రాజకీయ నాయకుడు చంద్రబాబు తప్ప దేశంలోనే ఎవరూ లేరన్నారు. <br/><br/>