విష ప్రచారంతో చంద్రబాబు దగా..

కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలి
చంద్రబాబుపై భూమన ధ్వజం
విజయనగరంః తిత్లీ తుపాన్‌ను చంద్రబాబు ప్రచారం కోసం వాడుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌  నేత భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు రాబట్టుకోవాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడు సరైన ముందస్తు చర్యలు  తీసుకోలేదన్నారు.  తుపాను నష్టాన్ని అంచనావేసి బాధితులను ఆదుకోవాలని సూచించారు. రాష్ట్ర ఖజానా నుంచి ని«ధులు ఇవ్వకుండా దాతల సాయం కోరతారా అంటూ ప్రశ్నించారు. పెద్ద విపత్తు జరిగి  దాదాపు 4 వేల కోట్లు పైగా నష్టం వాటిల్లి, వేలాది  ఎకరాల్లో పంటలు నాశనం అయితే సరైన నివేదికకాని, వారికి సాయం కాని లేదన్నారు. విష ప్రచారంతో ప్రజలను దగా చేస్తున్నారు. ఆందోళనలను పొగడ్తలుగా మార్చి హోర్డింగ్‌ల రూపంలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరుకూ ప్రభుత్వం నుంచి నయాపైసా ఖర్చుపెట్టకుండా  సాయం చేయండి అంటూ ప్రజలకు చంద్రబాబు లేఖ రాయడం దారుణమన్నారు. గతంలో  హూదుద్‌ తుపాన్‌ ప్రభావంతో విశాఖలో 65 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, అధికార లెక్కలు ప్రకారం  400 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదని స్పష్టమయ్యిందన్నారు. తిత్లీ తుపాన్‌ సహాయక చర్యలు అద్భుతంగా చేస్తున్నట్లు అనుకూల పత్రికల్లో ప్రచారం  చేసుకుంటున్నారని విమర్శించారు.

తాజా వీడియోలు

Back to Top