–తిత్లీ తుపాను ను కూడా చంద్రబాబు దోపిడీకి అవకాశంగా మార్చుకున్నారు.
- వైయస్ జగన్ రెండు హైపవర్ కమిటీలను బాధితుల కోసం నియమించారు
తిరుపతి: ఇటీవల సంభవించిన తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లా శోకాకుళంగా మారిందని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. తుపానును కూడా చంద్రబాబు దోపిడీకి అనుకూలంగా మార్చుకున్నారని విమర్శించారు. బాధితులను ఆదుకునేందుకు వైయస్ జగన్ రెండు హైపవర్ కమిటీలను నియమించారని తెలిపారు. శుక్రవారం భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
–తుపాను భాదితులను ఎవరూ ప్రశ్నించకుండా చంద్రబాబు పోలీసులతో నోరు నొక్కెస్తున్నారు.
–తుపాను తీవ్రతను తగ్గించగలిగానని తన అనుకూలమీడియాలో కలర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.–ప్రచార విషవాయువులోమునిగిపోయారు.
–గ్రామాలకు గ్రామలే మనోవేదన పడుతున్నాయి.
–తుపాను భీభత్సాన్ని అంచనా వేయడంలో చంద్రబాబు వైఫల్యం చెందారు.
–ప్రజలు సాయం అందడం లేదని చెబుతుంటే నోరుమూయండి,40 ఏళ్లు రాజకీయాలు చేస్తున్నా నాకు తెలియదా అనడం దారుణం.
–ప్రజల ఆగ్రహాన్ని కూడా చంద్రబాబుకు ప్రజలు అభిందనలు అంటూ విజయవాడ,అమరావతిలలో హోర్డింగ్ లు పెట్టుకుంటున్నారు.
–సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని ఇక్కడ చలి కాచుకుంటున్నారు.
–చంద్రబాబు వెళ్లిన ప్రతిచోట జనం నిలదీస్తున్నారు.
–తుపానును జయించినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు.
–చంద్రబాబు ప్రచారపిచ్చి తారాస్దాయికి చేరింది.
–సాయం అడిగితే దౌర్జన్యకారులని పేర్కొంటూ బుల్డోజర్ తో తొక్కిస్తామని చంద్రబాబు బెదిరిస్తున్నారు.
–నిలదీసే వారందరూ వైయస్ఆర్‌సీపీ వారే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.
– తుపాను బాధితులపై చంద్రబాబు అదికార జులుంతో దాదాగిరి చేస్తున్నారు.
– వైయస్ జగన్ రెండు హైపవర్ కమిటీలను నియమించి భాదిత ప్రాంతాలలో బాదితులను ఓదార్చాలని నిర్దేశించారు.
–భాదిత ప్రాంతాలకు మొదటగా వెళ్లింది వైయస్ఆర్‌సీపీ యంత్రాంగమే.
–ఇవన్నీ మరచి వైసిపి అధినేత తుపాను ప్రాంతానికి రాలేదంటూ ప్రచారం చేస్తున్నారు.
–గతంలో హోదా కోసం క్యాండిల్ ర్యాలీచేద్దామని వైయస్ జగన్ విశాఖఎయిర్ పోర్టుకు వస్తే అరెస్ట్ చేయించారు.
–గతంలో గోదావరి పుష్కరాలు,దివాకర్ ట్రావెల్స్ ప్రమాదం,పడవ ప్రమాదం మృతులను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేకపోయారు.
–తుపాను బాదిత ప్రాంతాలలో శ్రీ వైఎస్ జగన్ 15 రోజులలో పర్యటిస్తారు. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తారు.
–కేంద్రం తుపాను ప్రాంతంలో తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు.
–ప్రతిపక్షనేతపై అభాండాలు,నిందలు వేయడం మానుకో.
–నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది.
–మీరు సిఎం అయితే కరవు,తుపానులు,వరదలు ఎక్కువగా వస్తాయి.రైతాంగం ఎందుకు అధికంగా అప్పులపాలవుతుంది.రైతులు ఎందుకు అధికంగా ఆత్మహత్యలు చేసుకుంటారు.
–కరవు ప్రాంతాలలో రైతులకు చిన్న సహాయం కూడా ఎందుకు చేయడం లేదు.
–రైతులకు అన్నం పెట్టే కొబ్బరి చెట్టుపడిపోతే చెట్టుకు ముష్టి 1500 ఇస్తావా?
–తుపాను భాదితుల రైతుల కష్టాలు చూస్తే కళ్లల్లో రక్తం వస్తుంది.ప్రభుత్వ సహాయం చూస్తే కంటితుడుపు చర్యల్లా ఉన్నాయి.
–రైతులు కన్న పిల్లల్లా చూసుకుంటున్న జీడి,కొబ్బరి చెట్లు, తోటలు పడిపోవడంతో మరణమృదంగం మోగుతోంది..