నారాసురుని పాలన పోతేనే నిజమైన దీపావళి




– నాడు నరకాసురుడు..నేడు నారాసురుడు
– ఏపీలో నేడు నారాసురుడు రాజ్యమేలుతున్నాడు
– దీపావళికి ముందు రోజు నరకాసుర వధ చేస్తారు
– నరకాసురుడు ఎన్నో పాపాలు చేశాడు
– రాష్ట్రంలో దాడులు, హత్యలు జరుగుతున్నాయి
– మహిళలపై దౌర్జన్యాలు జరిగితే అరిట్టే ప్రయత్నం చేయలేదు
 – 2019 ఎన్నికల్లో నారాసుర రాజకీయ సంహారం జరగాలి
 – తుపానును కూడా చంద్రబాబు స్వార్థానికి పాడుకున్నారు
– నష్టపరిహారం చెక్కులపై చంద్రబాబు బొమ్మ ఎలా వేస్తారు?
– సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారా?
– ఆపరేషన్‌ గరుడ పురాణం చెప్పిన పెయిడ్‌ ఆర్టిస్టు శివాజీపై చర్యలేవి?
– వ్యవస్థలను వాడుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరు
– పోలీసు నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి?
– ఇంటలిజెన్స్‌ వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు

హైదరాబాద్‌: రాష్ట్రంలో నారాసురుడు రాజ్యమేలుతున్నాడని, నారాసుర పాలన కొనసాగుతుందని, ఈ పాలన పోతేనే ఏపీలో నిజమైన దీపావళి పండుగ వస్తుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సారధ్యంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, సంక్షోభంలో చంద్రబాబు తన సంక్షేమాన్ని వెతుకున్నారని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆనం మాట్లాడుతూ..రేపు జరిగే దీపావళి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి కంటే ఒక రోజు ముందు నరకాసురవధ ఉంటుందన్నారు. ఈ నరకాసురవధ ఎందుకు జరిగిందో అందరికి తెలుసు అన్నారు. రాక్షస జాతికి సంబంధించిన వ్యక్తి చేసిన తప్పులన్నింటినీ కూడా క్రోడికరించి సత్యభామ కృష్ణులు హతమార్చారని, ఆయన మరణం రోజు ఆనందదాయకంగా పండుగలు చేసుకుంటారని పౌరాణిక చరిత్రలో తెలిసిన చరిత్ర అన్నారు. నరకాసురుడు ఎన్ని తప్పులు చేశాడని వెతికితే నాలుగైదు తప్పులు కనిపిస్తాయన్నారు. స్వతహాగా రాక్షసుడు కాబట్టి సామన్య జనాలను ఇబ్బందులను పెట్టడం, మహిళలను వేధించడంతో అతన్ని హతం చేశారని తెలుసు అన్నారు. ఇవాళ ఏపీలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే నాడు నరకాసురుడు అయితే..నేడు నారాసురుడు రాజ్యమేలుతూ ఎన్ని తప్పులు, అరాచకాలు, హత్యలు జరుగుతున్నాయని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను చూస్తే ఎక్కడా కూడా ఐదేళ్ల కాలంలో బెల్టుషాపులు తీసేసిన పరిస్థితి లేదన్నారు. మహిళలపై దౌర్జన్యకాండ జరిగితే ప్రభుత్వం అడ్డుకోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ భూములను దోపిడీ చేసి భూ కుంభకోణాలు చేస్తున్నా అడ్డుకునే పరిస్థితి లేదన్నారు. అక్రమాలు చేస్తూ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను నీచాతీనీచంగా కొనుగోలు చేసినా అడిగే నాథుడు లేడని, సమాధానం చెప్పేవారు లేరన్నారు. రాష్ట్రంలో ఇసుకాసురులు, సిలికాసురులు, చందనాకుయులు ఇతర దేశాలకు తరలిస్తుంటే అడ్డుకున్న పరిస్థితి లేదన్నారు. ఇవాళ పండుగ చేసుకోవాలంటే కచ్చితంగా 2019లో జరిగే ఎన్నికల్లో నారాసుర వధ జరగాలన్నారు. నారాసుర సంహారం జరగాలన్నారు. అప్పుడే దీపావళి పండుగను చూసే, చేసుకునే మహాద్భాగ్యం కలుగుతుందన్నారు. మొన్న తుపాను వస్తే ఏపీలో సంక్షోభాన్ని కూడా తమ స్వార్థానికి వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని ప్రజలు గమనిస్తున్నారన్నారు. హుద్‌హుద్‌ తుపాను, తిత్లీ తుపాను వస్తే కూడా స్వార్థానికి వాడుకున్నారన్నారు. తుపానులో నష్టపోయిన వారికి పరిహారం అందిస్తున్నామన్న పేరుతో బ్యాంకులను కూడా వైలెట్‌ చేసి ఒక ప్రింటెడ్‌ కాఫీతో చెక్కులపై చంద్రబాబు ఫోటో పెట్టి బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం నీచ రాజకీయమన్నారు. తిత్లీ బాధితులను ఆదుకునేందుకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు వెళ్తే అల్లరి మూకాలు వచ్చారని విమర్శలు చేశారన్నారు. సంక్షొభాన్ని స్వార్థానికి వాడుకోవడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు రాజకీయ స్వార్థానికి ఎంత మంది బలి కావాలని ప్రశ్నించారు. తిత్లీ తుపానులో పేదలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. టీవీల్లో ఎక్కడైనా ప్రకటన వస్తే పోలీసు కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులను వేధించేందుకు వ్యవస్థలను వాడుకోవడం దారుణమన్నారు. వ్యవస్థలను దిగదార్చడంలో చంద్రబాబును మించిన మరొకరు ఉండరన్నారు. ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పని చేయడం లేదన్నారు. 

టీడీపీ అభ్యున్నతికి మాత్రమే ఈ వ్యవస్థను వాడుకుంటున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులకు నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పడం బాధాకరమన్నారు. తప్పు చేస్తే నోటీసులు ఇవ్వండి కానీ, ఇలా వేధించడం సరికాదన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చిన కథనాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేస్తారా అని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరుగబోతుందని చెప్పిన ఆపరేషన్‌ గరుడు రచయితను ఎందుకు విచారించలేదన్నారు. ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామిగా ఉండాల్సిన డీజీపీ ఎలా పని చేస్తున్నారని, ఇంటిలిజెన్సీ చీఫ్‌ ఏమయ్యారని ప్రశ్నించారు. కౌంటర్‌ ఇంటలీజెన్సీ అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు కొనుగోలు చేసేందుకు వినియోగిస్తున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసులో పని చేసేందుకు ఇంటలీజెన్సీలను వాడుకుంటున్నారన్నారు. టీడీపీకి అమ్ముడపోయిన ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోతే ఇంటలిజెన్సీ వ్యవస్థ ఏం చేస్తుందన్నారు.

ఏపీలో ప్రజాదరణ కలిగిన వ్యక్తి, రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోయే వైయస్‌ జగన్‌పై దాడి జరిగితే ఈ రాష్ట్ర ఇంటలీజెన్సీ వ్యవస్థ విఫలమైందన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఈ పెద్ద మనిషి జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కూడగట్టి వ్యవస్థలను బలోపేతం చేస్తారట అని ఎద్దేవా చేశారు. రాహుల్‌తో మొదలుపెట్టి అనేక రాజకీయ పార్టీల నాయకులను కలిశారని, వారంతా ఇప్పటికే యూపీఏ కూటమిగా ఏర్పాడ్డారని చెప్పారు. అలాంటి వారిని కలిసి కూటమి ఏర్పాటు చేశావా అని ప్రశ్నించారు. ఒక వ్యవస్థ నుంచి ఇంకోవ్యవస్థలోకి వెళ్లిన చంద్రబాబు చేసింది ఏమీ లేదని, యూపీఏలో చేరేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని వివరించారు. ఈ నారాసుర పాలన పోవాలని, నిజమైన దీపావళి పండుగ ఏపీ ప్రజలకు రావాలని, తెలుగు ప్రజలు ఆనందంగా కుటుంబాలతో దీపావళి పండుగ చేసుకోవాలంటే 2019 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇవాళ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని, అప్పులపై అప్పులు చేసి సంక్షోభంలో చంద్రబాబు తన సంక్షేమాన్ని చూసుకున్నారని, ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. పోలవరం నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాజెక్టులను ఏమేరకు పూర్తి చే శావని రామానారాయణరెడ్డి నిలదీశారు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం చేసిన ఘనత ఎంఏ ఎకనామిక్స్‌లో పట్టా పొందిన చంద్రబాబుకే సాధ్యమన్నారు. ప్రజాస్వామ్యవ్యవస్థలో  నారాసుర రాజకీయ వధ, భూస్థాపం జరగాలని ఆకాంక్షించారు.
 
Back to Top