29న జగ్గంపేటలో కీలక సమావేశం

 

ఆహ్వానితులంతా తప్పనిసరిగా రావాలని ఆదేశం

తూర్పుగోదావరి జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  కీల‌క స‌మావేశం తూర్పు గోదావ‌రి జిల్లా  జగ్గంపేటలో ఈ నెల 29న నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మావేశానికి పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశాలు ఆదివారం ప్రజా సంకల్పయాత్ర శిబిరం వద్ద జరుగుతాయని పార్టీకేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఆదివారం ఉదయం 11 గంటల నుండి 11:30 గంటల వరకు పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్ల సమావేశం, ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం జరుగుతుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా రావాలని పార్టీ అధ్యక్షులు ఆదేశించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సభాస్థలికి వైయ‌స్ ఆర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. పాదయాత్రలో 100వ నియోజకవర్గంగా నిలిచిన జగ్గంపేటలో కీలక సమావేశం జరగడం విశేషం.


Back to Top