దేవుడితో చంద్రబాబు చెలగాటం


పశ్చిమ గోదావరి: చంద్రబాబు గుడిలో పూజారులను, దేవుడితో చెలగాటమాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త నరసింహారాజు అన్నారు. 
 ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరసింహారాజు మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ పేద ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర మన నియోజకవర్గంలోకి ప్రవేశించిందన్నారు. 2014లో చంద్రబాబు అమలు కానీ 600 హామీలు ఇచ్చి..మోడీ, పవన్‌ సహాకారంతో అధికారంలోకి వచ్చారన్నారు. ఇసుక నుంచి మట్టి దాకా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. చట్టప్రకారం మనకు రావాల్సిన ప్రత్యేక హోదా రాకుండా కేంద్రానికి తాకట్టు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. గుడిలో పూజారులను, దేవుడిని కూడా వదలడం లేదని విమర్శించారు. చంద్రబాబుకు రాష్ట్రాన్ని విడిచి వెళ్లే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజా సేవా ముసుగులో రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్‌ జగన్‌ 9 మంచి పథకాలతో నవరత్నాలను రూపొందించి మనకు మేలు చేసేందుకు పాదయాత్రగా వచ్చారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తనపై నమోదైన కేసులపై న్యాయ విచారణకు ముందుకు రావాలని సవాల్‌ విసిరారు. వైయస్‌ జగన్‌ను సీఎం చేసేందుకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
 
Back to Top