మా రాజీనామాలతో బీజేపీకి కనువిప్పు


న్యూఢిల్లీ:  వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసినప్పుడే బీజేపీ కళ్లు లె రిచిందని, అందుకే అవిశ్వాస తీర్మానానికి ఒప్పుకుందని మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు.  మా త్యాగఫలితంగానే కేంద్రం దిగి వచ్చిందన్నారు. మాతో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉండి ఉంటే ప్రత్యేక హోదా ఇప్పటికే వచ్చి ఉండేదన్నారు. మాట తప్పడం చంద్రబాబుకు సహజంగానే వచ్చిందన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి టీడీపీ నాయకత్వంపై విశ్వాసం లేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కడప ఉక్కు దీక్షలోనే ఉక్కు లేదు..తుక్కు లేదని అన్నట్లు గుర్తు చేశారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి పనిచేసిన టీడీపీకి విభజన చట్టంలోని అంశాలు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. మొదటిసారి ఎన్‌టీఆర్‌ పుణ్యంగా సీఎం అయిన చంద్రబాబు రెండోసారి అటల్‌ బిహారీ వాజ్‌పేయి సహకారంతో సీఎం అయ్యారు. మూడోసారి బీజేపీ, జనసేన సహకారంతో ముఖ్యమంత్రి అయ్యారని వివరించారు. ఇపుడు మళ్లీ కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని విమర్శించారు. ఏదోరకంగా ముఖ్యమంత్రి కావాలన్నదే చంద్రబాబు ఆలోచన అన్నారు. వైయస్‌ జగన్‌ ధైర్యంగా పోరాడుతారని, మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన యోధుడని పేర్కొన్నారు.
 
Back to Top