నెల్లూరులో 2 నుంచి పార్టీ సమైక్యాంధ్ర దీక్షలు

నెల్లూరు :

మన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నుంచి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్తలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారని పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ తెలిపారు. జిల్లాలోని 10 నియోజకవర్గాలకు చెందిన 13 మంది సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో ఈ దీక్షలు ప్రారంభిస్తారని అన్నారు.‌ ‌సమైక్యాంధ్ర లక్ష్యంతో వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేపట్టను‌న్నదని శుక్రవారం సాయంత్రం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ మురళీధర్ చెప్పారు.‌ పార్టీ నిర్ణయం ప్రకారం ఈ దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top