కౌన్సిల్‌ హాల్‌ ఎదుట వైయస్‌ఆర్‌ సీపీ ఆందోళన

విజయవాడ: కౌన్సిల్‌ సమావేశం వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేపట్టింది. కార్పొరేషన్‌ ఆస్తులను కాపాడాలంటూ కౌన్సిల్‌ హాల్‌ ఎదుట వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం తరలింపును ఆపేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేషన్‌ సొమ్మును విచ్చల విడిగా టీడీపీ నేతలు దోచుకుతింటున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రజల సొమ్మును ప్రజాభివృద్ధికి వినియోగించాలన్నారు. కార్పొరేషన్‌ తరలింపును మానుకోపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

తాజా ఫోటోలు

Back to Top