మాజీ కార్పొరేటర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కక్షసాధింపు చర్యలు

నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చివేత..
కార్పొరేటర్‌కు అండగా నిలిచిన వైయస్‌ఆర్‌సీపీ
ఏలూరుః మాజీ కార్పొరేటర్‌ దుర్గారెడ్డిపై ఎమ్మెల్యే బడేటి బుజ్జి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.  వైయస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి రావాలని కార్పొరేటర్‌ దుర్గారెడ్డిపై ఒత్తిడి చేస్తున్నారు. టీడీపీలో చేరకపోవడంతో నిర్మాణంలో ఉన్న కార్పొరేటర్‌  ఇల్లు కూల్చివేయడంతో  సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వైయస్‌ఆర్‌సీపీ నేత ఆళ్ల నాని కార్పొరేటర్‌కు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీలో చేరలేదని బడేటి బుజ్జి వేధింపులకు గురిచేయడం దారుణమన్నారు. ఏలూరులో టీడీపీ అక్రమాలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మాజీ కార్పొరేటర్‌ చింతా దుర్గా రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కక్ష సాధింపులు ఎక్కువ అయ్యాయి. కొన్ని నెలలుగా వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి రావాలని మాజీ కార్పొరేటర్‌పై ఒత్తిడి చేశారు. టీడీపీలో చేరకపోవడంతో ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఒత్తిడితో అయిదో డివిజన్‌లో నిర్మాణంలో ఉన్న మాజీ కార్పొరేటర్‌ చింతా దుర్గా రెడ్డి ఇంటిని మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. టీడీపీలో చేరకపోవడంతోనే ఎమ్మెల్యే బడేటి బుజ్జి  తనపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారని చింతా దుర్గా రెడ్డి ఆరోపించారు.

 
Back to Top