విశాఖపట్నం: విదేశీ కంపెనీలకు రెడ్ కార్పెట్ వేస్తూ రాష్ట్రంలోని బీసీలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యయన కమిటీ కన్వీనర్ జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడానికి బీసీలను వాడుకొని నాలుగేళ్లయినా.. బీసీలను పట్టించుకోవడం లేదన్నారు. ఫీజురియంబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడిచి నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోకుండా అడ్డుకుంటున్నాడన్నారు. బీసీలకు కల్పించిన నామినేటెడ్ పోస్టులు, నిధుల కేటాయింపులపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.