తిరుపతిలో వైసీపీ బంద్..నేతల అరెస్ట్

చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ చేపట్టిన  బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పార్టీనేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు.  అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతబడ్డాయి.వ్యాపార, వాణిజ్య సముదాయాలు  ముూసివేశారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.  దీంతో జనజీవనం స్తంభించింది.  పట్టణంలో బంద్ నిర్వహిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్టాండ్ సమీపంలో ధర్నా చేస్తున్న నాయకులను ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు.
Back to Top