పవన్‌.. పనికిమాలిన మాటలు మానుకో..

టీడీపీని కాపాడాలనే ముసుగులో ఇంకెంతకాలం నటిస్తావ్‌
చాలెంజ్‌ను స్వీకరిస్తున్నాం.. చర్చకు పవన్‌ కల్యాణ్‌ సిద్ధమా?
వైయస్‌ఆర్, చిరంజీవి హయాంలో పశ్చిమ అభివృద్ధి చర్చిద్దాం
తుందు్రరుపై వైయస్‌ జగన్‌ వైఖరి ఏంటని పవన్‌ అడగడం విడ్డూరం
ఆక్వా ఫ్యాక్టరీ బాధితులకు అండగా నిలబడింది వైయస్‌ జగన్‌ ఒక్కరే
శాంతిభద్రతల సమస్య అని తప్పించుకున్న వ్యక్తివి నువ్వు
చంద్రబాబుపై మమకారంతో వైయస్‌ఆర్‌ సీపీపై బురదజల్లడం మానుకో..
మహిళాలోకం తలదించుకునేలా పవన్‌ కార్యకర్తల కామెంట్స్‌ 
టీడీపీ హయాంలో ఎన్ని మర్డర్లు, అత్యాచారాలు జరిగాయో తెలియదా?
చిత్తశుద్ధి, నిజాయితీ ఆ రెండు లేకపోతే అవగాహనతోనైనా మాట్లాడాలి
పవన్‌ కల్యాణ్‌పై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ధ్వజం
ఏలూరు: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై, సమస్యల మీద పవన్‌కల్యాణ్‌ ఏమైనా అవగాహన ఉండి మాట్లాడుతున్నారో.. లేక విషయాన్ని పక్కదోవ పట్టించాలనే ఆలోచనలతో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఆళ్లనాని అన్నారు. తుందు్రరు ఆక్వాపార్కు విషయంలో వైయస్‌ జగన్‌ వైఖరి ఏంటో చెప్పాలని పవన్‌ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను బయటపడకుండా ఎప్పటికప్పుడూ కప్పిపుచ్చుతూ ప్రజలను మభ్యపెడుతున్న పవన్‌ కల్యాణ్‌.. నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాడుతున్న వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధిపై చర్చకు వైయస్‌ జగన్‌ రావాలనడం.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అవినీతికి పాల్పడ్డారని మాట్లాడడం.. పవన్‌ అవగాహన రాహిత్యం అని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే.. 

తుందు్రరు ఆక్వాపార్కు విషయంలో టీడీపీ అరాచకాలకు అడ్డుపడుతూ.. అందరికీ మద్దతుగా నిలబడింది వైయస్‌ జగన్‌. తుందు్రరు ఆక్వా పార్కు విషయంలో బాబు నిరంకుశ వైఖరి ఏ విధంగా ఉందో.. పారిశ్రామిక వేత్తలను వెనకేసుకొస్తూ ప్రజల ఉద్యమాన్ని అణగదొక్కాలని పోలీసుల సహాయంతో అణచివేతకు గురిచేశారు. వైయస్‌ జగన్‌ దగ్గరకు వెళ్లి ప్రజలు చంద్రబాబు మా జీవితాలు నాశనం చేస్తున్నారు.. మీరు మా ప్రాంతానికి వస్తే న్యాయం జరుగుతుంది రండీ అని సమస్యను దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే తుందు్రరు వచ్చి ప్రజలకు భరోసా ఇస్తూ.. ఆ సమస్యపై తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీస్తూ న్యాయం చేస్తానని చెప్పడం రాష్ట్రమంతా చూసింది. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే ఆక్వా ఫ్యాక్టరీని బంగాళాఖాతంలో కలిపేస్తానని వైయస్‌ జగన్‌ బహిరంగ సభలో చెప్పారు. ఆ తరువాత అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంలో తుందు్రరులో ఉద్యమం నడుస్తుండగానే..  మొగల్తూరులో  యాజమాన్యం నిర్లక్ష్యధోరణికి ఆరుగురు ప్రాణాలు కోల్పోతే.. వెంటనే మొగల్తూరు వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించడమే కాకుండా.. వారికి అండగా వైయస్‌ జగన్‌ నిలబడ్డారు. ఇవన్నీ జరుగుతుండగానే.. మళ్లీ మార్చి 31వ తేదీన ఆక్వా పార్కు మీద, తుందు్రరులో మిలట్రీ సామ్రాజ్యం నడుస్తుంది. ఆటవిక రాజ్యం నడుస్తున్న సమయంలో అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి పరిష్కరించిన నాయకుడు వైయస్‌ జగన్‌. 

ఎన్నో సంవత్సరాలుగా మా నాయకుడి దృష్టికి సమస్యను తీసుకొచ్చిన్న వెంటనే పోరాటం చేశారు.. వారికి అండగా నిలబడ్డారు.. స్పష్టమైన భరోసా ఇచ్చారు. మీరేం చేశారు పవన్‌..? మీ దృష్టికి ఎన్నోసార్లు తుందు్రరు పోరాట సమితి సభ్యులు సమస్యను తీసుకొస్తే అప్పుడు నేను వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది.. ఎంతోమంది ప్రాణాలు పోతాయి.. అలాంటి పరిస్థితి వద్దూ చంద్రబాబుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాని చెప్పి మీ చుట్టూ చెప్పులు, కాళ్లు అరిగిపోయేలా తిప్పుకోలేదా పవన్‌? భీమవరంలో నాలుగు రోజులుగా మకాం వేసిన పవన్‌ తుందు్రరు వెళ్లి వారిని పరామర్శించారా..? ఎప్పుడో వస్తాను.. ఎప్పడో న్యాయం చేస్తానని ఇప్పటి వరకు ఊరిస్తూ వచ్చిన పవన్‌ నాలుగు రోజులుగా భీమవరంలో ఉండి ఎందుకు తుందు్రరు వెళ్లలేదు. ఇంకెన్నాల్లు బాధితులను మోసం చేస్తారు.. ఇన్ని సంవత్సరాలు చేసిన అధ్యయనం సరిపోలేదా.. ఇప్పటికైనా చిత్తశుద్ధి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. వైయస్‌ జగన్‌పై బురదజల్లాలనే ప్రయత్నం పక్కనబెట్టాలి. 

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని పవన్‌ మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేష్, వైయస్‌ జగన్‌ వస్తే చర్చకు కూర్చొని మాట్లాడుతానని వ్యాఖ్యానించారు.. అసలు వైయస్‌ జగన్‌ ఏ విధంగా బాధ్యుడు ఎప్పుడైనా అధికారం చేపట్టారా..? పవన్‌కు ధైర్యం ఉంటే చంద్రబాబు, లోకేష్‌ను అడగాలి కానీ.. ముగ్గురు కలిసిరండీ.. ఒక్కడినే వస్తానని మాట్లాడడం పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది. ఇలాంటి అనవసరమైన సవాళ్లతో ప్రజలకు న్యాయం జరగదు.. అయినా చర్చే కావాలని కోరుకుంటే.. వైయస్‌ జగన్‌ అనుమతితో చర్చకు సిద్ధంగా ఉన్నాను. వైయస్‌ఆర్‌ సీఎంగా ఉండగా.. ఆయన పాలించిన ఐదేళ్ల కాలంలో పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన అభివృద్ధి, చిరంజీవి కేంద్ర మంత్రిగా రెండు సంవత్సరాలు పరిపాలన చేశారు. చర్చకు మేం కూడా సిద్ధం. పవన్‌ కల్యాణ్‌ సవాల్‌ స్వీకరిస్తున్నాం. చర్చకు పవన్‌ వచ్చినా సరే.. జనసేన నాయకులను పంపించినా సరే..

పశ్చిమగోదావరి జిల్లాలో అభివృద్ధికి బీజం వేసింది వైయస్‌ఆర్‌. కలగా మిగిలిపోయిన పోలవరం ప్రాజెక్టుకు పునాదులు వేసింది వైయస్‌ఆర్, అనుమతులు తీసుకొచ్చింది. కాల్వలు పూర్తి చేసింది వైయస్‌ఆర్‌. అంచెనాలను పెంచడం తప్ప చేసిన పనేందని వైయస్‌ఆర్‌ సీపీ టీడీపీని ప్రశ్నిస్తుంటే.. టీడీపీని వెనకేసుకొస్తూ నాలుగేళ్లుగా పల్లెత్తు మాట అనకుండా.. వైయస్‌ఆర్‌ హయాంలో అభివృద్ధి జరగడం లేదని పవన్‌ చర్చకు పిలవడం హాస్యాస్పదం.. మాట్లాడే ముందు కొంత అవగాహన అవసరం.. పవన్‌ కల్యాణ్‌ ఆలోచించి మాట్లాడాలి. కేవలం వైయస్‌ఆర్‌ సీపీపై అక్కసు వెల్లగక్కడం కాదు.. వాస్తవాలు తెలియక మాట్లాడుతున్నారో.. తెలుసుకునే ప్రయత్నం చేయక మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. 

అసెంబ్లీని వదిలి వైయస్‌ జగన్‌ ప్రజాక్షేత్రంలో తిరగడం నేరం కింద పవన్‌ మాట్లాడుతున్నారు.. అసెంబ్లీకి హాజరుకాకపోవడానికి కారణాలంటి.. అవగాహన ఉంటే ఇటువంటి అర్థపర్ధం లేని మాటలు మాట్లాడరు. తుందు్రరు నుంచి రాజధాని భూములు ఇలా ప్రతి సమస్యను వెలుగెత్తి పోరాటం చేశారు. ప్రతిపక్ష నేత ఒక సమస్య గురించి మాట్లాడుతుంటే.. స్పీకర్‌ టక్కున మైక్‌ కట్‌ చేయడం.. ప్రతిపక్ష నేత అనే గౌరవం కూడా లేకుండా నిల్చోబెట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రినో మాట్లాడించడం.. వైయస్‌ జగన్‌ఫై దుమ్మెత్తిపోయడం.. సమస్యను ప్రస్తావించే అవకాశం ఇవ్వకుండా మూకుమ్మడిగా వ్యక్తిగత దూషణలకు పాల్పడడం.. సభాసమయాన్ని దుర్వినియోగం చేసిన చంద్రబాబుది తప్పుగా కనిపించలేదా..?

అసెంబ్లీలో వైయస్‌ఆర్‌ సీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బును, మంత్రి పదవులను ఎరగా వేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదా..? ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఏ విధంగా ఖూనీ చేశారో ప్రజలంతా చూశారు. అలాంటి చంద్రబాబును నిలదీస్తుంటే.. టీడీపీ చేస్తున్న నిరంకుశ వైఖరిని ఎండగట్టాలని ప్రజల తరుపున పోరాటం ప్రజాక్షేత్రంలోనే చేయాలని నిర్ణయించుకొని పాదయాత్ర చేస్తున్నారు. అసెంబ్లీ నుంచి పారిపోయారని పవన్‌కల్యాణ్‌ కించపరుస్తూ మాట్లాడడం సంస్కారులు మాట్లాడే మాటలు కావు. పవన్‌ కల్యాణ్‌ మీరేం చేశారు..? ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానన్నారు.  ఎవరైనా రాజీనామాలు చేయండి మద్దతు ఇస్తాను.. ఢిల్లీకి వెళ్లి జాతీయ పార్టీ మద్దతు కూడగడతానని చెప్పారు. అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటానని చెప్పిన పవన్‌.. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి, ఆమరణ దీక్షలు చేసినా కనీసం ఢిల్లీకి వచ్చి పరామర్శించే ప్రయత్నం చేయలేదు. కనీసం ఢిల్లీ మొహం అయినా చూశారా.. ?

బీజేపీ, టీడీపీలు ఒక్కటై హోదాను తుంగలో తొక్కుతుంటే.. వైయస్‌ జగన్‌ ప్రజల మద్దతుతో ఒంటరి పోరాటం చేస్తూ.. ప్రజల మద్దతుతో ఢిల్లీలో పోరాటం చేసి.. ఆమరణ దీక్ష చేసి పోరాటం ఉధృతం చేస్తుంటే.. ఏపీ దాటకుండా పవన్‌ కబుర్లు చెప్పడం మోసం చేయడం కాదా.? ఇప్పటికైనా చిత్తశుద్ధి, నిజాయితీతో.. ఆ రెండు లేకపోతే అవగాహనతోనైనా మాట్లాడండి పవన్‌. 

మహానేత వైయస్‌ఆర్‌ని కోట్లాది మంది ప్రజలు ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. కనీసం మానవత్వంతో ఆలోచించా చనిపోయిన నాయకుడి గురించి ఎవరూ మాట్లాడరు.. సభ్యసమాజం తలదించుకునేలా... రాజమండ్రి, విశాఖ, శ్రీకాకుళం సభల్లో దారుణంగా వైయస్‌ఆర్‌ గురించి మాట్లాడారు.. పవన్‌ గురించి మాట్లాడితే.. ఆయన అభిమానులు బాధపడతారో.. మరి వైయస్‌ఆర్‌ను ఒక అవినీతి పరుడని వ్యక్తిగతంగా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడితే.. అది భగవద్గీత.. వైయస్‌ జగన్‌ మాట్లాడితే వ్యక్తిగత విషయాలంట. 

మహిళా లోకం తలదించుకునేలా జననేత నాయకులు, కార్యకర్తలు ప్రవరిస్తున్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబంలోని ఒక మహిళలను జనసేన నాయకులు, అభిమానులు సోషల్‌ మీడియాలో ఎంత అసభ్యపదజాలంతో మాట్లాడుతున్నారు. 48 గంటలు గడిచిన తరువాత తీరిగ్గా అటువంటి మాటలు మాట్లాడకండి అని బుద్ధభగవానుడిలా పవన్‌ ప్రవచనాలు మాట్లాడుతున్నారు. వైయస్‌ జగన్‌ను అక్రమంగా నిర్బంధిస్తే పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలందరికీ భరోసా ఇవ్వడానికి మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రపంచంలో ఏ మహిళ అంత సాహసం చేసి ఉండదు.. దేశంలోని మహిళలకు వైయస్‌ షర్మిల ఆదర్శంగా నిలిచింది. ఉన్న విషయాల గురించి వైయస్‌ జగన్‌ మాట్లాడితే.. మగాడివైన నీకే అంత బాధ కలిగితే.. ఒక మహిళలపై అసత్య ప్రచారాలు, లేనిపోని ఆరోపణలు చేయడంతో వారి కుటుంబ సభ్యులు,ఆమె ఎంత బాధపడుతుందో పవన్‌ మీకు తెలియదా..?

మాట మాట్లాడితే పవన్‌కల్యాణ్‌ ఫ్యాక్షనిజం అంటారు. రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గంలో ఆరు మర్డర్లు జరిగాయి.. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగాయో.. ఎంత మంది చిన్నారులపై అత్యాచారాలు ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎమ్మార్వోను కొట్టేవారు ఒకరు. ఇసుక దోపిడీ చేశారు ఒకరు.. హత్యలు చేయించేవారు ఒకరు ఇలా హత్యా రాజకీయాలు చేసేవారంతా టీడీపీలోనే ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలపై పవన్‌ కల్యాణ్‌ అవగాహన ఉండే మాట్లాడుతున్నారా.. అర్థం కావడం లేదు. 
 
పవన్‌ కల్యాణ్‌ చిత్తశుద్ధి ఏంటో పోలవరం ప్రాజెక్టుకు వచ్చినప్పుడే ప్రజలు గమనించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పర్యటన పెట్టుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలందరినీ పోలవరం సందర్శించాలని, అవకతవకలు వెలికి తీయండి అని పోలవరం సందర్శన కార్యక్రమాన్ని రూపొందిస్తే.. రాత్రికి రాత్రే పవన్‌కల్యాణ్‌ రాజమండ్రి చేరుకొని పోలవరం సందర్శించడం ఏంటీ.? పోలవరం వచ్చి పవన్‌కల్యాణ్‌ చేసిన హంగామా అందరికీ తెలుసు. చంద్రబాబును కాపాడాలనే ఏకైక లక్ష్యంతో పోలవరం వచ్చారు. ఆ తరువాత ఎప్పుడైనా పోలవరం గురించి మాట్లాడారా..? 

రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, వాస్తవాలు తెలుసుకొని సమస్యలపై అవగాహన పెంచుకొని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడాలి. ఆ విధంగా చేస్తే ప్రజలు హర్షిస్తారు.. ఇంకా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నట్లుగా నటించి టీడీపీని వెనకేసుకొని రావడాన్ని ప్రజలు క్షమించరు. నిజాయితీ పరుడనే ముసుగులో పవన్‌ మోసం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో రానున్న రోజుల్లో ఎవరు నిజాయితీ పరులు, పోరాటాలు చేసేదెవరో ప్రజలే తేల్చుతారు. 

 
Back to Top