టీడీపీకి అన్నీ వడ్డీతో సహా ఇస్తాం

  • కుట్రలు, కుతంత్రాల టీడీపీని ఓట్లతో కుళ్లబొడుద్దాం
  • రాజన్న రాజ్యాన్ని తీసుకొద్దాం
  • జగన్ అన్న సీఎం అయ్యేవరకు ఎన్ని కష్టాలైన ఎదుర్కొంటాం
  • పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ నేతల ప్రతిజ్ఞ
హైదరాబాద్ః వైయస్సార్ పాదాల చెంతన, ఆయన ఆశయాలకు అనుగణంగా ఏర్పాటైన పార్టీ వైయస్సార్సీపీ అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.  పార్టీ ఆరు వసంతాలు పూర్తి చేసుకొని ఏడవ వసంతంలోకి అడుగుపెట్టడం సంతోషకరమని అన్నారు. పార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే ఉపఎన్నికల్లో వైయస్సార్సీపీ రాజకీయ సునామీ సృష్టించిందని చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె లోటస్ పాండ్ లో మాట్లాడారు. ఏమన్నారంటే.... వైయస్ఆర్ అన్న మూడు పదాలు వింటే పేదవాడి గుండె ఎలా పులకరించిపోతుందో చూశాం. వైయస్ రాజశేఖరరెడ్డి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులాగ ఉండి అన్ని సంక్షేమ కార్యక్రమాలతో అందరికీ న్యాయం చేశాడు కాబట్టే ఆయన లేకపోయినా ఆయన ప్రతిరూపమైన వైయస్ జగన్ ను గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. వైయస్ఆర్ లేని లోటును ఈ ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చిన మనిషి జగన్ అన్న. వైయస్సార్సీపీని స్థాపించి ప్రజల పక్షాన చిన్నవయసులోనే ఎన్నో పోరాటాలు, నిరాహార దీక్షలు చేశారు. ఆయనెంత నిస్వార్థపరుడైన నాయకుడో కళ్లారా చూశాం. వైయస్సార్సీపీలో ఉన్నందుకు మేమంతా గర్వపడుతున్నాం.ఇలాంటి నాయకుని వెనక పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతవరకు జరిగింది ఓ లెక్క. ఇకమీదట జరగబోయేది ఓ లెక్క. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత తథ్యమో..2019న జగన్ అన్న సీఎం అవ్వడం అంతే తథ్యం.

ఏడవ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రతిజ్ఞ
కుట్రలు పన్ని, అన్యాయంగా వైయస్ జగన్ ను జైలుకు పంపించిన వాళ్లను ఓట్లతో కుళ్లబొడుద్దాం. చనిపోయిన వైయస్ఆర్ పై బురజల్లిన వారిని బురదలో కలిపేద్దాం. రాజన్న రాజ్యాన్ని తీసుకొద్దాం. అవమానాలు, అక్రమాలు చేస్తున్న టీడీపీకి అన్నంటిని వడ్డీతో సహా ఇస్తాం. రాజన్న ఆశయాలకు అనుగణంగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేవరకు.. జగనన్న సీఎం అయ్యే వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొంటాం. జగన్ అన్న పిలుపు మేరకు ప్రజల పక్షాన ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం. జై జగన్ అన్న. జై వైయస్ఆర్ అంటూ రోజా పార్టీ నేతలచే ప్రతిజ్ఞ చేయించారు. 

Back to Top