ఐపీఎల్‌ను తలపించేలా వైయస్ఆర్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నీ

 చిత్తూరు: ప‌ది క్రీడామైదానాలు.. 340 జట్లు... 4,300 మంది క్రీడాకారులు.... ఒక క్రీడా క్షేత్రంలో తలపడనున్నారు. ఐపీఎల్‌ తలపించేలా జరిగే ఈ టోర్నీలో 4,300 మెమెంటోలు.. 339 మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ , 339 బెస్ట్‌ బౌలర్, బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ అవార్డులు.... చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్‌లో ఓ గ్రామీణ తిరుణాలే నడువనున్నది. ఈ టోర్నీకి 36 మంది నిపుణులైన అంపైర్లు... నిర్వహణ కోసం 500 మంది సిబ్బంది అహర్నిషలు కృషి చేస్తున్నారు. విజేత జట్టుకు ఎనిమిది అడుగుల ట్రోఫీతో పాటు లక్ష నగదు...పాల్గొనే ప్రతి జట్టుకు బ్యాట్, బాల్‌ బహుకరణ, ...వేలాది మందికి ప్రతి రోజు ఉచిత టీఫిన్, భోజనం..... ఇదీ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైయఆర్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేది నుంచి నిర్వహించనున్న వైయ‌స్ ఆర్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ కోసం జరుగుతున్న ఏర్పాట్లు. చంద్రగిరి ఐపీఎల్‌గా నిర్వహిస్తున్న ఈ గ్రామీణ క్రికెట్‌ టోర్నికి భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ట్రోఫీలు, వేలాది మెమెంటోలు, అవార్డు ప్రతిమలతో ఏర్పాటు చేసిన టోర్నీ ట్రోఫీల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలో జరిగింది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ట్రోఫీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వేలాది మందితో వైయ‌స్ఆర్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఒకసారి గెలిచాక ఐదేళ్ల వరకు ప్రజలను పట్టించుకొని నాయకులు ఉన్న ఈ రోజుల్లో ప్రతి నిత్యం ప్రజల కోసం తపిస్తూ, యువతను ప్రోత్సాహిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి నిజంగా ప్రజానేత అని కొనియాడారు. పల్లెలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఆయన తపిస్తున్న తీరు అభినందనీయమన్నారు. వేలాది మంది యువత, వందలాది జట్లతో చంద్రగిరి ఐపీఎల్‌గా వైయ‌స్ఆర్ గ్రామీణ క్రికెట టోర్నమెంట్‌ విజయవంతం అవుతుందని పేర్కొన్నారు.

Back to Top