విద్యార్థుల ప్రాణాలు బలిగొంటున్న నారాయణ

వైయస్ఆర్ జిల్లాః నారాయణ కాలేజీలో విద్యార్థిని పావని మృతికి నిరసనగా నేడు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైయస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ పిలుపు మేరకు విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.  నారాయణ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, మంత్రి నారాయణను బర్తరఫ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థుల మృతిపై మంత్రి నారాయణ బాధ్యత వహించాలన్నారు.  ప్రభుత్వ విచారణ కమిటీలపై తమకు నమ్మకం లేదని, న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు డిమాండ్ చేశారు.

Back to Top