ప్రజలు మనస్సులో వైయస్‌ఆర్‌

హైదరాబాద్‌: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించి 8 సంవత్సరాలు గడుస్తున్నా.. ప్రజల మనస్సులో ఆయన రూపం చెదిరిపోకుండా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. వైయస్‌ఆర్‌ చేసిన కార్యక్రమాలే వైయస్‌ఆర్‌ సీపీకి ఆశీస్సులు అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ఆర్‌ 8వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్థసారధి మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో రాజన్న రాజ్యం తీసుకురావడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి విజయం సాధించిందన్నారు. టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా నంద్యాలలో 70 వేల మంది ఓటర్లు ధైర్యంగా వైయస్‌ఆర్‌ సీపీకి ఓటు వేశారన్నారు. తెల్లకార్డు ఉన్న లబ్ధిదారులకు కనీసం కిరోసిన్, పంచదార ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి చంద్రబాబు ఉన్నారన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top