పార్టీని, నాయకత్వాన్ని అందించిన మహానేత స్ఫూర్తి

హైదరాబాద్ః  దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న మహానేత అని వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్ఆర్ ఏనాడు మాటలు చెప్పలేదని..అభివృద్ధిని చేసి చూపించారని అన్నారు. ఆ చేతలే  ఓ దీటు రాయి అయ్యాయని పేర్కొన్నారు. దేశమంతా వైయస్ఆర్ చేసిన పనులను ఆదర్శంగా తీసుకున్నాయని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ 8వ వర్థంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పార్టీ నేతలు పార్థసారధి,  లక్ష్మీపార్వతి, ఆదిశేషగిరి రావు, ప్రసాద రాజు, పుత్తా ప్రతాప్ రెడ్డి,  వాసిరెడ్డి పద్మ, బ్రహ్మానందరెడ్డి, విజయ్ చందర్ , చల్లా మధు, వెల్లాల రామ్మోహన్, భవనం భూషణ్, బి. మోహన్ తదితరులున్నారు. 

వైయస్ఆర్ వెళుతూ వెళుతూ మనకు ఓ వారసత్వం,  భవిష్యత్తుకు అవసరమైన నాయకున్ని జగన్ రూపంలో ఇచ్చి వెళ్లారన్నారు.  ఆయన జ్ఞాపకాలు కోట్లాది హృదయాల్లో పదిలంగా ఉన్నాయన్నారు.  ఆ జ్ఞాపకాల స్ఫూర్తే మనల్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రానికి సువర్ణ భవిష్యత్తు ఇవ్వగలిగిన ఓ పార్టీ, నాయకత్వాన్ని రెండు రాష్ట్రాలకు అందించిందన్నారు. ప్రస్తుత పాలన చూస్తే వైయస్ఆర్ పాలనకు పూర్తిగా భినంగా ఉందన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికలను చంద్రబాబు ఓ క్రీడలాగ చూస్తున్నారని మండిపడ్డారు. మాదే విజయం, శాశ్వతంగా టీడీపీదే అధికారం అన్న అహంభావంతో మాట్లాడుతున్నారన్నారు. ప్రజలతో మమేకమయ్యే నాయకుడు చూపాల్సిన విధేయత బాబులో ఎక్కడ కనిపించలేదన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో మూడున్నరేళ్ల పాలన మీద తీర్పు ఇవ్వండి అని ఏనాడు అడగలేదన్నారు. ఈ మూడున్నరేళ్లలో బాబు చేసిందేమీ లేదని, అంతా మోసమేనని దుయ్యబట్టారు.   మన నాయకుడు వైయస్ జగన్ బాబు మూడున్నరేళ్ల మోసపూరిత పాలన మీద తీర్పు ఇవ్వాలని అడిగారన్నారు. మేం వస్తే ఏం చేస్తామో కూడ చెప్పారని తెలిపారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఓటర్లను బెదిరించి, డబ్బులు వెదజల్లి బాబు వికృత క్రీడకు తెరలేపాడని ధ్వజమెత్తారు. 

చీరలు, బెడ్ షీట్ల పంపిణీ
మహానేత వర్థంతి సందర్భంగా వైయస్సార్సీపీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున చీరల పంపిణీ జరిగింది. చల్లా మధు అంధులకు రూ. 25వేల చెక్ అందించారు. బెడ్ షీట్లు పంపిణీ చేశారు. 


తాజా ఫోటోలు

Back to Top