ఢిల్లీకి బ‌య‌లుదేరిన వైయ‌స్ విజయమ్మ

న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా సాధన కోసం తమ పదవులను త్యాగం చేసి ఢిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద అమరణ నిరాహారదీక్ష చేస్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలను  పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయ‌స్‌ విజయమ్మ పరామర్శించనున్నారు.  ఈ మేర‌కు ఆమె హైద‌రాబాద్ నుంచి ఢిల్లీకి బ‌య‌లుదేరారు. ఏపీ భ‌వ‌న్‌లో ఆమ‌ర‌ణ దీక్ష చేస్తున్న‌ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వైయ‌స్ అవినాష్‌రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, మిథున్‌రెడ్డిల‌ను విజ‌య‌మ్మ ప‌రామ‌ర్శిస్తారు.  అలాగే ఆస్పత్రిలో ఉన్న  మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఆమె పరామర్శిస్తారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్నందున ఆయన తరఫున విజయమ్మ ఢిల్లీకి వస్తున్నారని వైయ‌స్ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  

Back to Top